Skip to main content

సముద్రయాన అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

ఏటా జూన్ 25న అంతర్జాతీయ నౌకాదళ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ ఆర్థిక శాస్త్రం, వాణిజ్యాన్ని పెంచడంలో సముద్రయాన కృషిని తెలియ‌జేయడం ఈ రోజు ముఖ్య ఉద్ధేశం.

సీఫరర్ ప్రాముఖ్యత..
ప్రపంచ ఆర్థిక స్థితి, వాణిజ్యాన్ని పెంచడంలో సముద్రయానదారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అనేక పరిశ్రమలు సముద్ర మార్గాలు, ఓడలపై ఆధారపడతాయి. అందువల్ల వ్యాపారాన్ని సులభతరం చేయ‌డానికి సముద్రయానదారులు చాలా అవసరం.

నేపథ్యం..
ఈ రోజును మొట్టమొదటిసారిగా 2011 లో అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) జరుపుకుంది. షిప్పింగ్ పై దృష్టి కేంద్రీకరించిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ సంస్థ ఈ రోజును నియమించింది. "కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్, వాచ్ కీపింగ్ ఫర్ సీఫరర్స్ (STCW)" ఆమోదించిన తీర్మానం ద్వారా దీన్ని నియమించారు. ఈ సమావేశం 1978లో ఫిలిప్పీన్స్‌లో జరిగింది.

రోజు ప్రాముఖ్యత..
ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యానికి ముఖ్యమైనది. ఈ రోజును వివిధ దేశాల ప్రభుత్వాలు, షిప్పింగ్ కార్పొరేషన్లు జరుపుకోవ‌డ‌మే కాకుండా, రోజుకు సంబంధించిన అవగాహనను ప్రోత్సహించడానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ సందర్భంగా వ్యాపారాన్ని సులభతరం చేయడం, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని పెంచడంలో నావికులు పోషిస్తున్న పాత్ర గురించి అవగాహన పెంచుతారు. IMO విదేశీ పోస్టుల వద్ద నావికుడి హక్కులపై కూడా చర్చిస్తుంది. ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలు కూడా నావికుడికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

2021 థీమ్..
ఈ సంవత్సరం, అంతర్జాతీయ నౌకాదళ దినోత్సవం- “సముద్రయానదారులు: షిప్పింగ్ భవిష్యత్తులో ప్రధాన భాగం” అనే థీమ్‌తో పాటించారు.

Published date : 17 Jul 2021 01:14PM

Photo Stories