ప్రపంచ సాయిల్(సారం) దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
నేల నిర్వహణ పెరుగుతున్న తీవ్రమైన సవాళ్లకు ప్రతిస్పందించడం, నేల జీవ వైవిధ్యం కోల్పోకుండా చూడడం, నేల సారంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, సంస్థలు, సంఘాలు, వ్యక్తులకు అవగాహన కలిగించడం, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు, మానవ శ్రేయస్సును నిర్వహించడం, నేర సారం విషయంలో కట్టుబాట్లు చేయడాన్ని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
జనాభా విస్తరణ కారణంగా పెరుగుతున్న సమస్యను ప్రపంచ నేల దినోత్సవం కూడా హైలైట్ చేసింది. నేల కోతను తగ్గించడానికి, ఆహార భద్రతను నిర్థారించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది వివరిస్తునంది.
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్స్ (ఐయూఎస్ఎస్) 2002లో అంతర్జాతీయంగా నేల దినోత్సవాన్ని జరుపుకోవాలని సిఫారసు చేసింది.
అదనంగా ప్రపంచ మట్టి దినోత్సవాన్ని కింగ్‌డమ్ ఆఫ్ థాయిలాండ్, గ్లోబల్ సాయిల్ పార్టనర్ షిప్ కింద ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచే వేదికను అధికారికంగా స్థాపించడానికి ఎఫ్ఏవో మద్దతు ఇస్తుంది.