Skip to main content

ప్ర‌పంచ ప‌శువైద్య దినోత్స‌వం 2020

ప్ర‌తి ఏడాది ఏప్రిల్ నెల‌లో ఆఖ‌రి శ‌నివారం నాడు ప్ర‌పంచ ప‌శువైద్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు.
ఈ ఏడాది ప్ర‌పంచ ప‌శువైద్య దినోత్సం ఏప్రిల్ 25న జ‌రుపుకుంటున్నారు. ఈ ఏడాది ప్ర‌పంచ ప‌శువైద్య దినోత్స‌వం థీమ్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకై మాన‌వుల‌, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర్చ‌డం.

చ‌రిత్ర‌:
మొద‌టి ప్ర‌పంచ ప‌శువైద్య కాంగ్రెస్ 1863లో డాక్ట‌ర్ జె.మీ గామ్గీ నాయ‌కత్వంలో జ‌రిగింది. ఆ త‌ర్వాత ప‌శువైద్య అసోసీయేష‌న్ గా మారింది. ప‌శువైద్యానికి సంబంధించి వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న జాతీయ ప‌శువైద్య సంఘాల‌కు ఈ ప్ర‌పంచ ప‌శువైద్య అసోసీయేష‌న్ కేంద్ర‌ బిందువులా మారింది. 2000వ సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ ప‌శువైద్య దినోత్స‌వ వార్షికోత్స‌వాలు వేడుక‌గా జ‌రిగాయి. ప‌శువుల సంక్షేమం, వాటి ఆరో గ్యాన్ని మెరుగుప‌ర్చ‌డమే ల‌క్ష్యంగా ఈ దినోత్స‌వాలు జ‌రుపుకుంటున్నారు. మానవుల‌, జంతువుల జీవ‌న‌శైలి ఏవిధంగా అనుసంధా నించి ఉంది, అలాగే వాటి ఉనికి ఒక‌దానిపై ఒక‌టి ఎలా ఆధార‌ప‌డి ఉన్నాయో తెలియ‌జేయ‌డ‌మే ఈ దినోత్స‌వ ముఖ్యోద్దేశం.
Published date : 27 Apr 2020 05:41PM

Photo Stories