ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2021 వేడుకలను ఏ దేశం నిర్వహిస్తుంది?
Sakshi Education
దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి అత్యవసర చర్య తీసుకోవాలనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2021 వేడుకలకు అతిథ్య దేశంగా పాకిస్తాన్ వ్యవహరించనుంది.
సాధారణంగా మనుషులు తమ మనుగడ కోసం అడవుల నుంచి పీట్ లాండ్స్, తీరాల వరకు అన్నింటిపై ఆధారపడతారు. మొక్కలు, జంతువులు, ప్రజలు - వాటి పరిసరాల మధ్య ఉండే పరస్పరం ఆధారపడి జీవించడాన్నే జీవావరణ వ్యవస్థలుగా నిర్వచిస్తారు. ఇందులో ప్రకృతితో పాటు నగరాలు లేదా పొలాలు వంటి మానవ నిర్మిత వ్యవస్థలు కూడా ఉన్నాయి.
పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అనేది ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. చైనా లేదా యూఎస్ఏ కంటే ఎక్కువగా బిలియన్ల హెక్టార్ల భూమిని సమతుల్యం చేయడం ద్వారా ప్రజలకు ఆహారం, పరిశుభ్రమైన నీరు, ఉద్యోగాలు లభిస్తాయి.
Published date : 10 Jul 2021 01:15PM