Skip to main content

ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 24న జరుపుకుంటారు. పోలియో రహిత ప్రపంచ గురించి చేసే ప్రయత్నాలను చూపేందుకు ఈ రోజును ఏర్పాటు చేశారు. అలాగే పోలియో వ్యాక్సిన్ల వాడకాన్ని రోజు ప్రోత్సహిస్తుంది.

నేపథ్యం:

  • రోటో ఇంటర్నేషనల్ ఒక దశాబ్దం క్రితం ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన మొదటి బృందానికి నాయకత్వం వహించిన జోనాస్ సాల్క్ పుట్టిన రోజు జ్ఞాపకార్థం దీన్ని ఏర్పాటు చేశారు.
  • డ‌బ్ల్యూహెచ్‌వో ప్రకారం, 1980 నుంచి ప్రపంచవ్యాప్తంగా చేసిన టీకా ప్రయత్నాల వ‌ల్ల‌ వైల్డ్ పోలియో వైరస్ కేసులు 99.9 శాతానికి పైగా తగ్గాయి.
  • వివిధ దేశాల‌ ప్రభుత్వాలు, డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలోని గ్లోబల్ పోలియో నిర్మూలన ఇనిషియేటివ్ (జీపీఈఐ) ప్రపంచవ్యాప్తంగా వ్యాధి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
  • మూడేళ్ల సున్నా కేసుల తరువాత, 2014 జనవరిలో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్ర‌క‌టించారు. విజయవంతమైన పల్స్ పోలియో ప్రచారం ద్వారా పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయ‌గ‌లిగారు.
  • దేశంలో వైల్డ్ పోలియో కేసును చివరిగా జనవరి 13, 2011న క‌నుగొన్నారు.
Published date : 28 Nov 2020 02:26PM

Photo Stories