Skip to main content

ప్రపంచ చెస్ దినోత్సవాన్ని ఎప్పుడు జ‌రుపుకుంటారు?

ఏటా జూలై 20ను ప్రపంచ చెస్ దినోత్సవంగా జ‌రుపుకుంటారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచెక్స్ (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ లేదా వరల్డ్ చెస్ ఫెడరేషన్) వ్యవస్థాపక దినోత్సవంగా దీన్ని నిర్వ‌హిస్తారు.

అలాగే కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఎక్కువ మంది ఆట ఆడేలా పోత్సాహించ‌డానికి ఈ రోజును ఏర్పాటు చేశారు.

ఈవెంట్స్:
"చెస్ ఫర్ రికవరీ బెటర్" అనే పేరు 20 జూలై 2020 న వ‌ర్చువ‌ల్ గా జ‌లరిగిన ఉన్న‌త స్థాయి స‌మావేశంలో చెస్ ఆటగాళ్ళు, ఐక్యరాజ్యసమితి, వివిధ దేశాల ప్రభుత్వ అధికారులు, పౌర సమాజం ప్రతినిధులు, విద్యావేత్తలు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

చరిత్ర:

  • 1924 లో పారిస్‌లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) స్థాప‌న‌కు గుర్తుగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) జూలై 20 ను ప్రపంచ చెస్ దినోత్సవంగా ప్రకటించింది.
  • 1966 నుండి ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాకారులు జూలై 20 ను అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా జ‌రుపుకుంటున్నారు. అంతర్జాతీయంగా చెస్ కార్యకలాపాలకు FIDE ఇస్తున్న మద్ధతుకు గుర్తుగా UN ఈ రోజును ప్రారంభించింది.
  • ప్రపంచంలోని అన్ని ప్రజలలో స్నేహపూర్వక సామరస్యాన్ని మెరుగుపరచడం ల‌క్ష్యంగా ఈ రోజును ఏర్పాటు చేశారు.
  • సస్టైనబుల్ డెవలప్‌మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) ఎజెండా అయినా 2030 వ‌ర‌కు విద్యను బలోపేతం చేయడం, లింగ సమానత్వాన్ని సాధించ‌డం, మహిళల సాధికారత సాధించేలా ప్రోత్సాహిస్తుంది.
Published date : 03 Aug 2020 07:45PM

Photo Stories