Skip to main content

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

ఆరోగ్యంపై ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ల‌క్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుంది.
ఇది 1948లో జ‌రిగిన‌ మొదటి ఆరోగ్య సభలో ప్రతిపాదించ‌గా, 1950లో అమల్లోకి వచ్చింది. ఈ వేడుక ప్రజ‌ల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉద్ధేశ్యంతో ఏర్పాటు చేశారు.

గత 50 సంవత్సరాలుగా, ఇది మానసిక ఆరోగ్యం, తల్లి, పిల్లల సంరక్షణ, వాతావరణ మార్పు వల్ల క‌లిగే ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెచ్చింది. జాతి, మతం, రాజకీయ నమ్మకం, ఆర్థిక లేదా సామాజిక‌ స్థితి అనే భేదం లేకుండా ప్రతి మ‌నిషికి ప్రాథమిక హక్కులలో అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలను అందించాల‌నే WHO రాజ్యాంగ సూత్రాన్ని ఇది హైలైట్ చేస్తుంది.

ప్రతి వ్యక్తికి మంచి, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడం అనేది 2021 థీమ్. WHO మాట్లాడుతూ, COVID-19 మహమ్మారి కార‌ణంగా ప్రపంచ జ‌నాభా ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డ‌డంతో పాటు ఎక్కువ మందిని పేదరికం, ఆహార లేమిలోకి నెట్టివేసింది. లింగ, సామాజిక, ఆరోగ్య అసమానతలకు కార‌ణమైంది.
Published date : 01 May 2021 04:56PM

Photo Stories