నేషనల్ ఇంజనీర్స్ డే ఎప్పుడు పాటిస్తారు?
Sakshi Education
భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సర్ ఎంవీ) పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజును ఏర్పాటు చేశారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలోని ఇంజనీర్ల విజయాలను గుర్తు చేసుకోవడం ఈ రోజు లక్ష్యం.
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య:
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశంలో అత్యంత పేరు సాధించిన సివిల్ ఇంజనీర్, ఆర్థికవేత్త, ఆనకట్ట బిల్డర్, రాజనీతిజ్ఞుడు.
సర్ ఎంవీ వల్ల దేశంలో నీటి పారుదల సౌకర్యాలు పెరిగాయి. భారీ సంఖ్యలో ప్రజలను వరదలు నుంచి రక్షించింది. పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక ప్రాజెక్టులలో ఆయన చేసిన కృషికి ఆయన "ఫాదర్ ఆఫ్ మోడరన్ మైసూర్"గా ప్రసిద్ది చెందారు.
1955 సంవత్సరంలో, భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి భారతరత్న అవార్డు లభించింది. ఆయనికి పేరుకు ముందు “సర్” గౌరవాన్నిచ్చే బ్రిటిష్ నైట్‌హుడ్‌ని కింగ్ జార్జ్ వీ ఇచ్చారు.
Published date : 07 Oct 2020 03:25PM