Skip to main content

జూలై 29న గ్లోబల్ టైగర్ డే

గ్లోబల్ టైగర్ డే సందర్భంగా (జూలై 29) సందర్భంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ‘టైగర్స్, కో-ప్రెడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా (2018) నివేదిక’ గురించి పూర్తి స‌మాచారాన్ని విడుదల చేసింది. అందులో గ‌తంలో పులులపై చేసిన మూడు సర్వేలు (2006, 2010, మరియు 2014) సమాచారాన్ని, 2018-19 సర్వే డేటాతో పోల్చి పులుల సంఖ్యలో పెరుగుద‌ల‌ను అంచ‌నా వేసింది.

ప్రధానాంశాలు..
సెయింట్ పీటర్స్బర్గ్ ప్రకటన:

  • 2006 లో భారతదేశంలో 1,400 పులులు ఉన్నాయి. పులుల సంఖ్యను 2022 సంవ‌త్సరం వ‌ర‌కు రెట్టింపు చేయాల‌నే ఉద్ధేశంతో 2010లో విడుద‌లైన సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లారేష‌న్ లక్ష్యం కంటే నాలుగు సంవ‌త్సరాలు ముందుగానే భార‌త‌దేశం 2,967ల పులుల‌తో త‌న ల‌క్ష్యాన్ని సాధించింది.
  • రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జ‌రిగిన స‌మావేశంలో టైగర్ రేంజ్ దేశాల ప్రభుత్వాల అధిపతులు 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాల‌నే సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రకటనపై సంతకం చేసి త‌మ ఆమోదం తెలిపారు.
  • అదే సమావేశంలో జూలై 29 ను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇది పులుల సంరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.
  • భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావో పిడిఆర్, మలేషియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం వంటి 13 దేశాలు ఈ టైగ‌ర్ రెంజ్ లో ఉన్నాయి.

దేశంలో పులుల స్థితి:

    • 2018-19 జాతీయ పులి స్థితి అంచనా ప్రకారం 2014 (2,226) నుంచి 33% పెరుగుద‌ల‌తో మొత్తం 2,967 పులులు ఉన్నాయి.
    • 2018లో చేసిన స‌ర్వే(ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి) అతిపెద్ద కెమెరా-ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వేగా గిన్నిస్ రికార్డు సృష్టించింది.
    • 2006 నుంచి 2018 వరకు భారతదేశంలో పులులు సంవత్సరానికి 6% చొప్పున పెరుగుతున్నట్లు గమనించారు.
    • పశ్చిమ కనుమలలో (నాగర్హోల్-బండిపూర్-వయనాడ్-ముదుమలై- సత్యమంగళం- బిలిగిరి రంగనాథస్వామి టెంపుల్ బ్లాక్) సుమారు 724 పులులతో ప్రపంచంలోనే ఎక్కువ పులులు ఉన్న ప్రదేశంగా గుర్తింపు పొందింది.
Published date : 11 Aug 2020 03:56PM

Photo Stories