జీరో వివక్ష దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
Sakshi Education
మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష, అసమానతలను సవాలు చేయడానికి 2021 మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా జీరో వివక్ష దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మహిళల హక్కులను పరిరక్షించడం, వివక్షను రూపుమాపడం, మహిళల సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంపై అవగాహన పెంచడం, సమావేశాలలో చర్యలు తీసుకోవడం ఈ రోజు ఉద్దేశ్యం.
ఐక్యరాజ్యసమితి హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కార్యక్రమం (యునాయిడ్స్) 2013 డిసెంబర్‌లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా "జీరో వివక్ష ప్రచారం" ప్రారంభించిన, తరువాత ఐక్యరాజ్యసమితి మార్చి 1, 2014న మొదటిసారి "జీరో వివక్షత దినోత్సవాన్ని" నిర్వహించింది. ప్రపంచంలోని అందరి సమాన హక్కులు, గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్ధేశం. అన్ని వివక్షలను అంతం చేసే లక్ష్యంతో ఈ రోజును ఏర్పాటు చేశారు.
Published date : 06 Mar 2021 05:16PM