జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
Sakshi Education
క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, ప్రజల మరణానికి కారణమవుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్‌ది రెండో స్థానం.
ముఖ్యాంశాలు:
- కేంద్ర ఆరోగ్య మంత్రి మొట్టమొదటి జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని 2014 సెప్టెంబర్‌లో ప్రకటించారు. క్యాన్సర్ నియంత్రణపై రాష్ట్రస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన, ఉచిత స్క్రీనింగ్ కోసం మున్సిపల్ క్లినిక్‌లకు నివేదించమని ప్రజలను ప్రోత్సహించారు.
- ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తుంది.
- పొగాకు నమలడం అనేది క్యాన్సర్ రావడానికి కారణమై 2018లో ఎక్కువ మరణాలకు దారి తీసింది.
- నోటి కుహరం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల మగవారు, మహిళలు రొమ్ము క్యాన్సర్, నోటి కుహరం క్యాన్సర్‌తో ఎక్కువగా మరణిస్తారు.
Published date : 02 Dec 2020 04:20PM