Skip to main content

జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

భారత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మ్యాథ‌మేటిక్స్ రంగంలో ప‌రిశోధ‌న‌లు చేయాల‌నుకున్న‌, నిధుల కొరత కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్న దేశంలోని వర్ధమాన గణిత శాస్త్రజ్ఞుల కోసం, గణితంలో వృత్తిని కొన‌సాగించాల‌నుకునే వారి కోసం స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను అందించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళి అర్పించారు.

శ్రీనివాస రామానుజన్ జననం శ్రీనివాస రామానుజన్ అయంగర్ (22 డిసెంబర్ 1887 - 26 ఏప్రిల్ 1920) భారతదేశంలో బ్రిటిష్ పాలనలో నివసించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. ఆయ‌న‌ గణిత విశ్లేషణ, సంఖ్య సిద్ధాంతం, ఇన్‌ఫినిటీ సిరీస్‌, కంటిన్యూడ్ ప్రాక్స‌న్స్ కోసం గణనీయమైన కృషి చేశారు. అలాగే ఎన్నో గణిత సమస్యలకు పరిష్కారా కోసం ప్రయ‌త్నించారు.

ఆయ‌న జీవించిన స్వల్ప జీవితంలో రామానుజన్ స్వతంత్రంగా దాదాపు 3,900 స‌మ‌స్య‌ల‌ను సాధించ‌గ‌లిగారు. (ఎక్కువగా ఐడెంటిపైస్‌ మరియు సమీకరణాలు). భారత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మించిన 125వ వార్షికోత్సవం సందర్భంగా మద్రాస్ విశ్వవిద్యాలయంలో 26 ఫిబ్రవరి 2012న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

Published date : 06 Jan 2021 04:19PM

Photo Stories