ఏప్రిల్ 9న సీఆర్పీఎఫ్‌శౌర్య దినోత్సవం లేదా శౌర్య దివాస్ జరుపుకుంటుంది
Sakshi Education
ప్రతి ఏడాది ఏప్రిల్ 9న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)శౌర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 55వ సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవాన్ని (శౌర్య దివాస్) ఏప్రిల్ 9, 2020న జరుపుకుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూ ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.
సీఆర్పీఎఫ్ శౌర్యం దినం లేదా శౌర్య దివాస్:
సీఆర్పీఎఫ్ శౌర్యం దినోత్సవం 1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం ప్రారంభంలో రాన్ ఆఫ్ కచ్లో సర్దార్ పోస్ట్ రక్షణను గుర్తుచేస్తుంది.
1965 ఏప్రిల్ 8, 9వ తేది రాత్రి సమయంలో పాకిస్తాన్ సైన్యం 51వ పదాతిదళానికి చెందిన దాదాపు 3500 మంది సైనికులు సర్దార్ పోస్ట్ వద్ద భారతదేశంపై దండెత్తారు. పాకిస్తాన్ సైన్యంలో 18 పంజాబ్ బెటాలియన్, 8 ఫ్రాంటియర్ రైఫిల్స్ మరియు 6 బలూచ్ బెటాలియన్లు ఉన్నాయి.
భారత సీఆర్పీఎఫ్ బెటాలియన్లు సుమారు 150 మంది సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీతో పోలిస్తే, సీఆర్పీఎఫ్ సైనికులు ఆర్సెనల్ పరంగా సరిపోలేదు. పాకిస్తాన్ దళాలు ఎంతో సునాయాసంగా భారత సీఆర్పీఎఫ్ దళాలను ఓడించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
పాకిస్తాన్ పదాతిదళాలు సీఆర్పీఎఫ్ సైనికుల పై మూడు వైపుల నుంచి దాడి చేస్తున్నాయి. యుద్ధం 12 గంటలు కొనసాగింది. చివరికి, పాకిస్తాన్ సైన్యం యుద్ధ భూమి నుండి పారిపోయింది, వారిలో 34 మంది చనిపోయారు, భారత సీఆర్పీఎఫ్ ఆరుగురు వీరసైనికులను కోల్పోయింది. ఆ అమర సైనికుల ధైర్య సాహాసాల గౌరవార్థం ప్రతి ఏడాది సీర్పీఎఫ్ ఈ రోజును శౌర్యం దినోత్సవం లేదా శౌర్యదివాస్‌గా జరుపుకుంటోంది.

Published date : 13 Apr 2020 03:44PM