Skip to main content

ఏప్రిల్ 7న ప్ర‌పంచ ఆరోగ్య దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు

ఆరోగ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ప్ర‌తి ఏడాది ఏప్రిల్ 7న ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. ఈ రోజున న‌ర్సులు, ఇత‌ర ఆసుప‌త్రి సిబ్బంది వారి స‌హాయ‌స‌హ‌కారాల‌ను గుర్తించ‌డ‌మే కాక ప్ర‌పంచాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో వారి కీల‌క పాత్ర‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తోంది.

ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్ఓ) మాత్రమే కాక అనేక ఇంత‌ర సంస్థ ఆ దినోత్స‌వ ప్రాముఖ్య‌త‌ను గుర్తించాయి. స‌మ‌తుల్య జీవ‌న‌ శైలిని కాపాడుకోవ‌డం గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ దినోత్స‌వ ముఖ్యోద్దేశం.

న‌ర్సులు, ఇత‌ర ఆసుప‌త్రి సిబ్బంది సేవ‌లు:
త‌ల్లి, బిడ్డ‌ల సంర‌క్ష‌ణ‌, సంక్ర‌మిత, అసంక్ర‌మిత వ్యాధులు, మాన‌సిక ఆరోగ్యం ఇంకా అనేక ఇత‌ర వ్యాధుల నుంచి ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో న‌ర్సులు, ఇత‌ర ఆసుప‌త్రి సిబ్బంది ముఖ్య భూమిక గూర్చి డ‌బ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

చ‌రిత్ర: 1948లో మొద‌టి ఆరోగ్య స‌మావేశంలో ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం గురించి ప్ర‌చారం ప్రారంభ‌మైంది. ఇది కాల‌క్ర‌మేణ 1950లో అమ‌లులోకి వ‌చ్చింది.

శారీర‌క, మాన‌సిక ఆరోగ్యం గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే కాక అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించే ఉద్దేశ్యంతో ఈ ప్ర‌చారం ప్రారంభ‌మైంది. ఈ ప్ర‌చారం ప్ర‌జ‌లు త‌మ ఆరోగ్యం పట్ల శ్ర‌ద్ధ చూపించేలా చేయ‌డ‌మే కాక ప్ర‌పంచాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డింది.
Published date : 15 Apr 2020 05:40PM

Photo Stories