Skip to main content

ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భార‌త్ దివాస్

దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది ఏ్రప్రిల్ 30న ఆయ‌ష్మాన్ భార‌త్ దివాస్ జ‌రుకుంటారు.
సామాజిక-ఆర్థిక, కుల జనాభా లెక్కల డేటాబేస్ ఆధారంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం క‌నీస వైద్య స‌దూపాయ‌లు అందిచ‌డం, ప్రోత్స‌హించ‌డ‌మే ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశం. భార‌త‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ ప‌థ‌కాన్ని 2018లో ప్రారంభించారు. ఇది పేద‌ల‌కు భీమా ప్రయోజ‌నాల‌ను అందిస్తోంది.

ఆయుష్మాన్ భార‌త్‌:
ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న(ఏబీపీఎంజేఏవై)ని నేష‌న‌ల్ హెల్త్‌ప్రోటెక్ష‌న్ మిష‌న్‌(ఏబీ-ఎన్‌హెచ్‌పీఎం)అని కూడా పిలుస్తారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏప్రిల్ 14, 2018న చ‌త్తీస్‌గ‌డ్‌లోని బీజాపూర్‌లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ల‌బ్ధిదారులు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని ప్ర‌భుత్వ, ప్ర‌వేట్‌వైద్య‌సంస్థ‌ల్లో వివిధ‌ర‌కాల వైద్య స‌దూపాయాల‌ను పొందే వీలు క‌ల్పిస్తోంది. ఈ ప‌థ‌కం ద్వారా సంవ‌త్స‌రానికి ఒక కుటుంబం 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వివిధ వైద్య ప్ర‌యోజ‌నాల‌ను పొందే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 కోట్ల కుటుంబాల‌కు ల‌బ్ధి చేకూరింది.
Published date : 30 Apr 2020 05:24PM

Photo Stories