ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు
Sakshi Education
భారతదేశంలో ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రతి ఏడాది ఈ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రాముఖ్యత:
73వ రాజ్యంగ సవరణ చట్టాన్ని 1992లో ఆమోదించారు. ఇది ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పంచాయతీ రాజ్ సంస్థలకు "రాజ్యాంగ హోదా" ను కల్పిస్తుంది. పంచాయతీలను నిర్వహించడానికి, వివిధ చర్యలు చేపట్టడానికి రాష్ట్రాలకు పూర్తి స్వతంత్ర హక్కు ఉంది. రాష్ట్రాల వారిగా స్వపరిపాలన యూనిట్లుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలు ఈ రాజ్యంగ సవరణ చట్టం కల్పిస్తోంది. పార్ట్ 9లో పంచాయతీ అనే టైటిల్ తో ఈ రాజ్యంగ సవరణ చట్టం గురించి ప్రస్తావించారు. అంతేకాదు నిబంధన 243 నుంచి 243(ఓ) ఆర్టికల్‌లో దీని గురించి ఉంది. కొత్తగా 11వ షెడ్యుల్‌లో పంచాయతీకి సంబంధించి 29 విధులను జోడించారు. డైరెక్టివ్ ప్రిన్సిపిల్ ఆఫ్ స్టేట్ పాలసీ(డీఎస్పీ)లోని 40వ ఆర్టికల్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసింది. ఈ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను నిర్వహించడానికి, చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలకు పూర్తి స్వతంత్ర అధికారాలు ఉన్నట్లు పేర్కొంది.
చరిత్ర:
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం 2010లో మొదటిసారి జరుపుకున్నారు. ఈ 73వ సవరణ చట్టం వల్ల రాజకీయ అధికారాన్ని అట్టడుగు స్థాయికి వికేంద్రీకరించడానికి సహాయపడింది. ఈ చట్టం గ్రామ, జిల్లా స్థాయిలో పంచాయతీల ద్వారా పంచాయతీ రాజ్‌ను సంస్థాగతీకరించడానికి ఉపకరించింది.

Published date : 24 Apr 2020 05:10PM