Skip to main content

ఏప్రిల్ 23న ఆంగ్ల భాషా దినోత్స‌వం జ‌రుపుకుంటారు

ప్ర‌తి సంవ‌త్స‌రం ఏప్రిల్ 23న ఆంగ్ల భాషా దినోత్స‌వం జ‌రుప‌కుంటారు.
భాష‌తో ముడిప‌డి ఉన్న సంస్కృతి, చరిత్ర, సాధించిన విజ‌యాలు గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశం.

ఆంగ్ల భాషా దినోత్స‌వం:
ఆంగ్ల భాషా మూలాల‌ను మ‌ధ్యయుగంలో గుర్తించారు. ఇంగ్లీష్ అనే పేరు యాంగిల్స్ నుండి వ‌చ్చింది. యాంగిల్స్ ఒక ప‌శ్చిమ జ‌ర్మ‌నీ తెగ‌, వీరు ఆంగ్లేయా ద్వీప‌క‌ల్పానికి చెందినవారు. భాష నుండి వ్యాక‌ర‌ణం, స్వ‌రాలు, ప‌దాల స‌ముదాయం వంటివి వ‌చ్చాయి. ఆంగ్ల భాష నెమ్మ‌దిగా అభివృద్ధి చెందుతూ, ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఆంగ్ల భాష దాదాపు 60 దేశాల అధికారిక భాష‌గా ఉంది. అంతేకాదు ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న దేశాల‌లో వాణిజ్య భాష‌గా మారింది.

చ‌రిత్ర‌:
ఏప్రిల్ 23, 2010న మొద‌టి ఆంగ్ల‌భాషా దినోత్స‌వాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌రిపింది. యూఎస్ ఇంగ్లీష్, ఫెంచ్, స్పానిష్, చైనీస్, ర‌ష్య‌న్‌, అర‌భిక్ భాష‌ల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి అధికారిక భాష‌ లుగా ప్ర‌క‌టించింది.
ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా ఐక్య‌రాజ్య‌స‌మితి అధికారిక భాష‌ల వాడ‌కాన్ని ప్రోత్స‌హించింది. ఆంగ్ల‌భాష‌లో ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత అయిన విలియం షేక్సిపియ‌ర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని, ఆయ‌న గౌర‌వార్థం ఏప్రిల్ 23న ఆంగ్ల‌ భాషా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాం.
Published date : 25 Apr 2020 04:57PM

Photo Stories