Skip to main content

ఏప్రిల్ 14న ప్ర‌పంచ చాగ‌స్ వ్యాధి దినోత్స‌వం

ప్ర‌జ‌ల్లో చాగ‌స్ వ్యాధి నియంత్ర‌ణ‌, నిర్మూల‌నపై వారికి స‌రైన‌ అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ప్ర‌తి ఏడాది ఏప్రిల్ 14న ప్ర‌పంచ చాగ‌స్ వ్యాధి దినోత్స‌వం జ‌రుపుకుంటారు.

చాగ‌స్ వ్యాధి: చాగ‌స్ వ్యాధిని అమెరిక‌న్ ట్రిప‌నోసోమియాసిస్ అని కూడా పిలుస్తారు. ట్ర‌యాటోమైన్ బ‌గ్ ప‌రాన్న‌జీవి ట్రిప‌నోసోమాక్రుజీని వ్యాప్తి చేసే ప్ర‌దేశాల్లో ఈ వ్యాధి సాధార‌ణం. ఈ వ్యాధి ఎక్కువ‌గా ద‌క్షిణ అమెరికా, మ‌ధ్య అమెరికా, మెక్సికో వంటి ప్ర‌దేశాల్లో ఎక్కువుగా క‌నిపిస్తోంది.

వ్యాధి ల‌క్ష‌ణాలు: జ్వక‌రం, శ‌రీరం ఉబ్బ‌డం వంటివి ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు. స‌రైన చికిత్స తీసుకోన‌ట్ల‌యితే గుండే సంబంధిత వ్యాధులు ఉత్ప‌న్న‌మ‌వుతాయి.

చికిత్స చేయు విధానం: ఈ చాగ‌స్ వ్యాధి కార‌క జీవి అయిన ప‌రాన్న‌జీవిని చంపే జౌష‌ధాల‌ను సేవించ‌డం వ‌ల్ల ఈ వ్యాధిని నివారించవ‌చ్చు.
Published date : 16 Apr 2020 04:55PM

Photo Stories