ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు
Sakshi Education
ప్రతి ఏడాది ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గర్భిణీలు, పాలిచ్చే మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సౌకర్యాల గురించి అవగాహన పెంచడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. జాతీయ గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు మహిళల సరైన ఆరోగ్య సంరక్షణ మరియు ప్రసూతి సౌకర్యాల గురించి అవగాహన పెంచడానికి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ప్రకటిం టించిన మొదటి దేశం భారత్.
చరిత్ర: శాంతికి చిహ్నమైన భారత్ నేషనల్ మదర్‌హుడ్ డేను ప్రకటించిన మొట్టమొదటి దేశం. గర్భధారణ, ప్రసవానంతరం మహిళలకు ఆరోగ్య విషయాల్లో సరైన సౌకర్యాలు, అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు. 2003లో మొట్టమొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇదే రోజు కస్తూర్బా గాంధీ జ న్మదినోత్సవం కావడం మరో విశేషం.
Published date : 14 Apr 2020 03:46PM