Skip to main content

బైసాఖి, రంగోలిబిహు, నబాబ‌ర్ష‌, వైశాఖాధి, పుతండు వంటి పండుగ‌లు ఏప్రిల్ 14న జ‌రుపుకుంటారు

ఏప్రిల్ 14న బైశాఖి సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, డిప్యూటి ప్రెసిడెంట్ వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోది ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.
భారత‌దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు బైసాఖి, రంగోలిబిహు, నబాబ‌ర్ష‌, వైశాఖాధి, పుతండు వంటి పండుగ‌లను జ‌రుపుకుంటారు. ముఖ్యంగా హిందువులు, సిక్కులు ఘ‌నంగా జ‌రుపుకునే మ‌త పండుగ‌. పంట‌లు కోతకు వ‌చ్చిన స‌మ‌యంలో రైతుల క‌ష్టానికి, వారి శ్ర‌మ‌కు గుర్తుగా ఆనందంగా జ‌రుప‌కునే పండుగా. ఇది భార‌త‌దేశ విభిన్న‌సంస్కృతికి తార్కాణంగా నిలుస్తోంది ఈ పండుగ‌.

ఈ పండుగ‌ను విక్ర‌మ్ సావంత్ క్యాలెండ‌ర్ ఆధారంగా సౌర‌మాన కొత్త సంవ‌త్స‌రంగా జ‌రుపుకుంటారు. ప్ర‌తి ఒక్క‌రికి ఆహారాన్ని అందించ‌డ‌మే కాక, ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుకై ఆహారాన్ని భ‌ద్ర‌ప‌ర్చ‌డం వంటి వాటిల్లో రైతుల క‌ష్టాన్ని, శ్రామిక శ‌క్తిని అభినందిస్తూ వారిని గౌర‌వించ‌డ‌మే ఈ పడుగ ల‌క్ష్యం. పంజాబ్‌లో బైశాఖి పండుగ‌ను పంట‌లు చేతికి వచ్చే ఏప్రిల్ మాసంలో జ‌రుపుకుంటారు.

విజు మ‌ళ‌యాళ నూత‌న సంవ‌త్స‌ర పండుగ‌. దీన్ని ఏప్రిల్ 14న జ‌రుపుకుంటారు. పుతందు అంటే త‌మిళ నూత‌న సంవ‌త్స‌రం. ఇది ఏప్రిల్ 14న జ‌రుపుకుంటారు.

పోయిల‌బాయిషాక్‌(న‌బాబ‌ర్ష‌) అంటే బెంగాలీ నూత‌న సంవ‌త్స‌రం. దీన్ని ఏప్రిల్ 15న జ‌రుపుకుంటారు. రంగోలిబిహు అనేది అస్సాం ప్ర‌జ‌లు పంట‌లు చేతికి వ‌చ్చినపుడు జ‌రుపుకునే పండుగా. దీన్ని ఏప్రిల్ 15న జ‌రుపుకుంటారు
Published date : 18 Apr 2020 05:31PM

Photo Stories