బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
Sakshi Education
ప్రపంచ స్థాయి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి అవసరమైన చర్యలు, ప్రయత్నాలపై దృష్టి పెట్టడానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2002లో బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని ప్రారంభించింది.
ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు, యజమానులు, కార్మిక సంస్థలు, పౌర సమాజంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల్లో బాల కార్మికుల దుస్థితిపై అవగాహన కల్పించడం, వారికి సహాయం అందేలా చూడడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఈ సంవత్సరం బాల కార్మికులకు వ్యతిరేక ప్రపంచ దినోత్సవం థీమ్: 'ఇప్పుడే చర్య తీసుకోండి: బాల కార్మికులను నిర్మూలించండి.' 2021లో దినోత్సవానికి ముందు యునిసెఫ్, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఇచ్చిన నివేదిక ప్రకారం, బాల కార్మికుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్లకు పెరగింది. అందులోనూ గత నాలుగేళ్లలో 8.4 మిలియన్ల పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి ఎంతో మందిని పేదరికం అంచుకు నెట్టివేయడం బాల కార్మికుల పెరుగుదలకు ప్రధాన కారణం.
Published date : 16 Jul 2021 01:23PM