ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
Sakshi Education
ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపతి ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1964లో ఏర్పడిన ఏబీయూ లాభాపేక్ష లేని, ప్రసార సంస్థల వృత్తిపరమైన సంఘం. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రసార సంఘాలలో ఒకటి.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రసార అభివృద్ధికి, దాని సభ్యుల సమష్టి ప్రయోజనాలను ప్రోత్సహించడంలో ఏబీయూ పాత్ర ఉంది. ఏబీయూ కార్యకలాపాలలో ఒకటి ఆసియా విజన్, ఆసియాలోని 20 దేశాలలో టెలివిజన్ స్టేషన్లలో ఉపగ్రహాల ద్వారా రోజువారీ వార్తల ఫీడ్ల మార్పిడి.
టెలివిజన్, రేడియో ప్రసారకుల సమిష్టి ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ఏబీయూ ఒక ఫోరమ్‌ను అందిస్తుంది. ప్రసారకర్తల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఏబీయూ సెక్రటేరియట్ మలేషియాలోని కౌలాలంపూర్లోని అంకసాపురిలో ఉంది.
Published date : 05 Jan 2021 12:58PM