Skip to main content

అరుదైన వ్యాధుల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

సాధారణంగా, ఫిబ్రవరి 28 లేదా 29 అరుదైన వ్యాధుల రోజుగా నిర్వ‌హిస్తారు. 2021లో, ఫిబ్రవరి 28న ఈ రోజును పాటిస్తారు

. జనాభాలో చాలా కొద్ది భాగాన్ని మాత్ర‌మే ప్రభావితం చేస్తుంన్నందున ఈ అరుదైన వ్యాధుల‌ను అనాథ‌ వ్యాధులు అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన వ్యాధులు వారసత్వంగా వ‌స్తు వ్యాధి లక్షణాలు వెంటనే కనిపించకపోయినా, మ‌నిషి జీవిత కాలం ఉంటాయి.

భారతదేశంలో నమోదైన అత్యంత సాధారణ అరుదైన వ్యాధులు హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా. పిల్లలలో ప్రాథ‌మిక రోగనిరోధక శక్తి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, లైసోసోమల్ నిల్వ వ్యాధులు, పోంపే వ్యాధి, స్పోరిడియోసిస్, గౌచర్స్ వ్యాధి, సిస్టిక్ ఫైబ్రోసిస్, హేమాంగియోమా, కొన్ని రకాల కండరాల డిస్ట్రోఫీ.

అరుదైన వ్యాధులకు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన నిర్వచనం లేనప్పటికీ, దేశాలు సాధారణంగా ప్రాబల్యం, తీవ్రత, ఇతర చికిత్సా ఎంపికల ఉనికి ఆధారంగా సొంత వివరణలను తయారు చేస్తాయి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్‌లో అరుదైన వ్యాధి 200,000 కన్నా తక్కువ ప్రజలను ప్రభావితం చేసే వ్యాధిగా నిర్వచించారు. అరుదైన వ్యాధుల జాతీయ సంస్థ (NORD) ఇదే నిర్వచనాన్ని ఉపయోగిస్తుంది.

Published date : 08 Mar 2021 05:04PM

Photo Stories