Skip to main content

అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

ఏటా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని డిసెంబర్ 18న ఐక్యరాజ్యసమితి, అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు జరుపుకుంటాయి. ఈ సంవత్సరం, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని రీమాజినింగ్ హ్యూమన్ మొబిలిటీ థీమ్‌తో నిర్వహించారు.
ఈ తేదీన అన్ని వలస కార్మికుల, వారి కుటుంబాల సభ్యుల హక్కుల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సును స్వీకరించినందున డిసెంబర్ 18 ఎంపిక చేయబడింది.

అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని జరుపుకునే తీర్మానాన్ని 1990లో అన్ని వలస కార్మికుల, వారి కుటుంబ సభ్యుల హక్కుల పరిరక్షణకు అంతర్జాతీయ సదస్సులో ఆమోదించారు.

ఐక్యరాజ్యసమితి వలస వచ్చిన వారి సహకారం అందించేందుకు ఈ రోజును జరుపుకుంటారు. యూఎన్ ప్రకారం, ప్రపంచంలో సుమారు 272 మిలియన్ల మంది వలసదారులు ఉన్నారు. ఇందులో 41 మిలియన్ల మంది నిరాశ్రయులు.
Published date : 31 Dec 2020 03:01PM

Photo Stories