Skip to main content

అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవంగా డిసెంబర్ 5ను జరుపుకుంటారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ వాలంటీర్ డే (IVD)ను సాధారణంగా అంతర్జాతీయ వాలంటీర్ డే (IVD) అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ వాలంటీర్ డే వ్యక్తిగత స్వచ్ఛంద సేవకులు, సంఘాలు, సంస్థలకు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి తమ సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

అంతర్జాతీయ వాలంటీర్ డే (ఐవీడీ) అనేది ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, అకాడెమియా, ప్రైవేట్ రంగాలతో సహకరించడానికి వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం - యూఎన్‌జీఏ 1985 డిసెంబర్ 17న ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ వాలంటీర్ డే (ఐవీడీ)ను ఏర్పాటు చేశారు.

2012లో, ప్రపంచ‌వ్యాప్తంగా అట్టడుగు సంస్థల అభివృద్ధికి అనుభవంతో స‌ల‌హాలు ఇవ్వడానికి యూఎన్ వాలంటీర్స్ కార్యక్రమం "ఐదేళ్ల అంతర్జాతీయ వాలంటీర్ డే స్ట్రాటజీస్" ని ఏర్పాటు చేశారు.

ఐవీడీ వెబ్‌సైట్‌ను ప్రతి సంవత్సరం సుమారు 50,000 చూస్తుంటారు. దాదాపు 150 వ‌ర‌కు స్టోరీలు పోస్ట్ చేస్తారు. ఈ స్టోరీలు ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా వాలంటీర్లను, వేడుకల ఫోటోలు, వీడియోలను హైలైట్ చేస్తాయి.

Published date : 15 Dec 2020 03:52PM

Photo Stories