అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
ప్రజాస్వామ్యం గురించి ప్రజలలో అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పెద్ద సామాజిక, చట్టపరమైన, రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచంలో చాలా దేశాలు ఈ చట్ట నియమాన్ని సమర్థించాయి. అంతర్జాతీయ ప్రమాణాలు, చట్టబద్ధత, ప్రాథమిక సూత్రాలను గౌరవించాయి.
ప్రజాస్వామ్యం:
ప్రజాస్వామ్యం అనేది అంతర్జాతీయ సమాజం, జాతీయ పాలక మండళ్లు, పౌర సమాజం, వ్యక్తుల పూర్తి భాగస్వామ్యం, మద్దతుతో మాత్రమే ఏర్పడుతుంది.
ప్రజాస్వామ్యం రెండు మార్గాలైన పౌర సమాజం, రాజకీయాల మధ్య సమన్వయంతో ఏర్పడుతుంది.
ఎస్‌డీజీ 16:
ప్రజాస్వామ్యం సుస్థిర అభివృద్ధి కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 16 (ఎస్‌డీజీ -16) 2030 ఎజెండాలో ఉంది.
ఎస్‌డీజీ 16 ప్రకారం, ప్రజాస్వామ్యం అనేది శాంతియుత సమాజం, సమర్థవంతమైన, జవాబుదారీ, సమగ్ర సంస్థల మధ్య అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది.