అంతర్జాతీయ నదీ యాక్షన్ డే ఎప్పుడు పాటిస్తారు?
Sakshi Education
నదుల ప్రాముఖ్యత, వాతావరణ మార్పులపై అవగాహన పెంచడానికి మార్చి 14న అంతర్జాతీయ నదీ యాక్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీలు, వ్యక్తులు కలిసి నీటి అభివ`ద్ధికి అడ్డుపడే ప్రాజెక్టులు, ఆరోగ్యం, వాటర్‌షెడ్ల స్థిరమైన నిర్వహణపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. నదులు, నీరు, జీవితాన్ని జ్ఞాపకార్థం ఈ రోజును "అంతర్జాతీయ ఆనకట్ట దీనోత్సవం" అని పిలిచేవారు. భారతదేశంలో, నదులను రక్షించడానికి లేదా ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించే కొన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయి. వారిలో నర్మదా బచావో అండోలన్ ఒకటి.
మార్చి 1997లో బ్రెజిల్‌లోని కురిటిబాలో జరిగిన డ్యామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల మొదటి అంతర్జాతీయ సదస్సులో "ఆనకట్టలు, నదులు, నీరు, జీవితంపై అంతర్జాతీయ యాక్షన్ దినోత్సవాన్ని" ఆమోదించారు. 20 దేశాల ప్రతినిధులు మార్చి 14న బ్రెజిల్‌లో దీన్ని "పెద్ద ఆనకట్టలకు వ్యతిరేక చర్య దినోత్సవం"గా నిర్ణయించారు. విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించడం, బేసిన్ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, మన నదులకు మంచి నిర్వహణ ఉండేలా చూడడం ఈ రోజును ముఖ్య ఉద్దేశ్యం.
థీమ్ 2021: నదుల హక్కులు.
థీమ్ 2021: నదుల హక్కులు.
Published date : 17 Apr 2021 04:07PM