Skip to main content

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ 8న జరుపుకుంటారు. వ్యక్తులు, సంఘాలు, సమాజాలకు అక్షరాస్యత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ల‌క్ష్యం. మరింత అక్షరాస్యత గల సమాజాల వైపు తీవ్ర ప్రయత్నాల అవసరాన్ని ప్రోత్సహించడం కూడా ఈ రోజు లక్ష్యం.

థీమ్:

  • అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2020 థీమ్ “కోవిడ్‌-19 సంక్షోభ స‌మ‌యంలో అక్షరాస్యత, బోధనను పెంచ‌డం”.
  • ఈ థీమ్ అధ్యాపకుల పాత్ర, మారుతున్న బోధనలపై దృష్టి పెడుతుంది. జీవిత‌కాలం ఎదో ఒక‌టి నేర్చుకోవ‌చ్చు అనే దృక్పథాన్ని యువత, పెద్దల్లో క‌లిగించ‌డాన్ని ఇది హైలైట్ చేస్తుంది.

చరిత్ర:

  • 1966లో యునెస్కో అంతర్జాతీయ సమాజానికి వ్యక్తులు, సంఘాలు, సమాజాలకు అక్షరాస్యత  ప్రాముఖ్యాన్ని, మరింత అక్షరాస్యత కలిగిన సమాజాల పట్ల తీవ్ర ప్రయత్నాల అవసరాన్ని గుర్తుచేసేందుకు సెప్టెంబర్ 8ను ఏర్పాటు చేసింది.
  • యూఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ గోల్స్ (ఎస్డీజీ), ఐక్యరాజ్యసమితి (యూఎన్) 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి అక్షరాస్యత స‌మ‌స్య ఆధారం.
  • యూఎన్‌ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ ఎజెండాను ప్రపంచ నాయకులు సెప్టెంబర్ 2015లో స్వీకరించారు. ఎజెండా ప్రజల జీవితమంతా నాణ్యమైన విద్య, అభ్యాస అవకాశాలకు సార్వత్రిక ప్రాముఖ్య‌త‌ను ఇది ప్రోత్సహిస్తుంది.
  • యువకులందరూ అక్షరాస్యత సాధించేలా చూడటం ఎస్‌డీజీ-4 లక్ష్యాల్లో ఒకటి. ఈ నైపుణ్యాలు లేని పెద్దలు, వాటిని సంపాదించడానికి అవకాశం ఇవ్వడం ఈ రోజు లక్ష్యం.
Published date : 22 Sep 2020 04:48PM

Photo Stories