ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం
ప్రతి వ్యక్తి జీవితంలో క్రీడలు, రోజువారీ కార్యకలాపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.
ఈ రోజును 2012 సంవత్సరంలో వేడుకల రోజుల జాబితాలో చేర్చారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి జాతీయ క్రీడలు, సాహస పురస్కారాలను అందజేస్తారు.
ధ్యాన్ చంద్:
విజార్డ్ ఆఫ్ ఇండియన్ హాకీగా ప్రసిద్ది చెందిన ధ్యాన్ చంద్ సింగ్ 1905 ఆగస్టు 29న ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు.
1926 నుంచి 1948 వరకు 22 సంవత్సరాలలో ఆయన కెరీర్‌లో 400 అంతర్జాతీయ గోల్స్ కలిపి మొత్తం 1,000 గోల్స్ సాధించాడు. ధ్యాన్ చంద్ నాయకత్వంలో, భారత హాకీ జట్టు అనేక విజయాలు సాధించింది.
ఆయన 1928, 1932, 1936లో భారతదేశానికి 3 ఒలింపిక్ బంగారు పతకాలు సాధించంలో ముఖ్య పాత్ర పోషించాడు. మూడు సార్లు వరుసగా ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకొని తన పేరు చరిత్ర పుటలలో ఎక్కించుకున్నారు.