ఆగస్టు 29న అంతర్జాతీయ అణు పరీక్షలకు వ్యతిరేక దినోత్సవం
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ఆగస్టు 29న జరుపుకుంటారు.
అణు పరీక్షకు వ్యతిరేకంగా ప్రపంచ సంస్థ, యువజన నెట్‌వర్క్‌లు, మీడియాను అలెర్ట్ చేయడం ఈ రోజు లక్ష్యం. అణ్వాయుధాలు తొలగించేలా ఈ రోజు ప్రేరేపిస్తుంది.
చరిత్ర:
- 2 డిసెంబర్ 2009న, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) 64వ సెషన్‌లో 64/35 తీర్మానాన్ని ఆమోదించి ఆగస్టు 29ను అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది.
- అణ్వాయుధ పరీక్ష పేలుళ్లు లేదా ఇతర అణు పేలుళ్ల ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్ధేశం.
- 29 ఆగస్టు 1991న సెమిపలాటిన్స్క్ న్యూక్లియర్ టెస్ట్ సైట్ మూసివేయబడిన జ్ఞాపకార్థం పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు, కాస్పోన్సర్‌లతో కలిసి కజకిస్తాన్ ఈ తీర్మానాన్ని చేసింది.
- అణు పరీక్షలకు వ్యతిరేకంగా 2010లో అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రారంభించారు. 29 ఆగస్టు 1991న ఎంతో మంది స్పాన్సర్స్, కో స్పాన్సర్స్‌తో కలిసి కజకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ సైట్ మూసివేయాలని చేసిన తీర్మానానికి గుర్తుగా ఈ రోజును ఏర్పాటు చేశారు.
అణు పరీక్ష:
అణ్వాయుధ పరీక్ష 16 జూలై 1945న ప్రారంభమైంది. 2వేలకు పైగా పరీక్షలు జరిగాయి. యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా ఇప్పటివరకు అణ్వాయుధాలను పరీక్షించిన దేశాల జాబితాలో ఉన్నాయి.
Published date : 12 Sep 2020 02:50PM