Skip to main content

ఆగస్టు 23న అంతర్జాతీయ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవం

బానిసల‌ వాణిజ్య నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 23న జరుపుకుంటారు. బానిసల‌ వాణిజ్యాన్ని రద్దు చేసినందుకు గుర్తుగా ఈ రోజు ప్రతి సంవత్సరం పాటిస్తారు.

చరిత్ర:

  1.     బానిస వ్యాపారంలోని విషాదాన్ని ప్రజ‌లంద‌రికి చూపించ‌డానికి ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్ కల్చరల్ ప్రాజెక్ట్ అయిన "ది స్లేవ్ రూట్" లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోజును తీసుకున్నారు.
  2.     ఈ దినోత్సవం మొదట కొన్ని దేశాలలో, ముఖ్యంగా హైతీలో 23 ఆగస్టు 1998న, 23 ఆగస్టు 1999లో సెనెగల్‌లోని గోరీలో జరుపుకున్నారు.
  3.     ఈ విషాదానికి సంబంధించిన‌ చారిత్రాత్మక కారణాలు, పద్ధతులు, పర్యవసానాలను సమ‌ష్టిగా పరిశీలించడానికి, ఆఫ్రికా, యూరప్, అమెరికా, కరేబియన్ మధ్య పరస్పర చర్యల విశ్లేషణ కోసం ఈ రోజు ఉద్ధేశించింది.
Published date : 09 Sep 2020 03:27PM

Photo Stories