Skip to main content

ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఆగస్టు 10న పాటిస్తారు. సాంప్రదాయిక శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా శిలాజ రహిత ఇంధనాల ప్రాముఖ్యతను తెలియ‌జేసే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.
దీన్ని 2015 నుంచి పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ నిర్వ‌హిస్తోంది. జీవ ఇంధన రంగంలో ప్రభుత్వం చేసిన ప‌నుల‌ను ఈ రోజు హైలైట్ చేస్తుంది. సర్ రుడాల్ఫ్ డీజిల్ చేసిన పరిశోధన ప్రయోగాలను గౌరవించడం కూడా ఈ రోజు లక్ష్యం. ఆయ‌న‌ 1893లో వేరుశెనగ నూనెతో ఇంజిన్ నడిపాడు. ఆయ‌న‌ ప్రయోగం వ‌ల్ల వచ్చే శతాబ్దంలో శిలాజ ఇంధనాలను కూరగాయల నూనె భర్తీ చేస్తుంద‌ని, వివిధ యాంత్రిక ఇంజన్లకు ప‌ని కొస్తుంద‌ని తెలుస్తోంది. థీమ్:
  • “ఆత్మనీభర్ భారత్ వైపు జీవ ఇంధనాలు” అనేది ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం 2020 థీమ్. ఇది భారత ప్రభుత్వం చొరవతో బయో ఇంధనాల కార్యక్రమంతో కొన్ని సంస్థల మ‌ధ్య సయోధ్య కుదుర్చుతుంది.
జీవ ఇంధనాలు:
  • జీవ ఇంధనాలు పునరుత్పాదక జీవపదార్థ వనరుల నుంచి త‌యారు చేస్తారు. జీవ ఇంధనాల వినియోగం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.
  • జీవ ఇంధనాలు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి స్థిరమైన అభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డుతాయి. రవాణా ఇంధనాల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో ఈ ఇంధనాలు సంప్రదాయ ఇంధన వనరులను భర్తీ చేస్తాయి.
  • జీవ ఇంధనాలు దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారిస్తాయి. రైతులకు అదనపు ఉపాధిని కల్పిస్తాయి.
  • 2014 నుంచి జీవ ఇంధనాల వినియోగం పెంచ‌డానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.
  • ఈ విష‌య‌మై కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేప‌ట్టింది. ఓఎమ్జీల ద్వారా సేకరణ విధానాలను సరళీకృతం చేయడం, ఇథనాల్ కోసం పరిపాలనా ధర విధానం, ఇథనాల్‌ను సేకరించడానికి లిగ్నోసెల్యులోసిక్ మార్గాన్ని ప్రారంభించడం, దీర్ఘకాలిక ఇథనాల్ సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టడం, ఇథనాల్ స్వేదనం సామర్థ్యం అదనంగా పరిశ్రమలలో (డెవలప్‌మెంట్ & రెగ్యులేషన్, 1951) చట్టంలో అనేక నిబంధనలను సవరించడం మొద‌లైన‌వి.
Published date : 29 Aug 2020 02:34PM

Photo Stories