‘జై జవాన్ జై కిసాన్’ నినాదంతో స్థైర్యాన్ని నింపిన స్వాతంత్ర్య సమరయోధులు, భారత దేశ రెండవ మాజీ ప్రధాని..
మహాత్మా గాంధీ ప్రభావంతో స్వాతంత్ర ఉద్యమంలో చేరి తొలుత గాంధీకి, తరువాత జవహర్‌లాట్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానేకాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టారు. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత రవాణా మంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు.
1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని ఏకతాటిపై నడిపించాడు. ‘జై జవాన్ జై కిసాన్’అనే నినాదం ఈ యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది.
దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్‌లోనే ఆయన మరణించారు. మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది.