ఆర్థిక సర్వే (2017-18) సమీక్ష
Sakshi Education
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
ప్రపంచంలో భారతదేశాన్ని అధిక ప్రగతి కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థగా సర్వే పేర్కొంది. గత మూడేళ్లలో భారత సగటు వృద్ధి.. ప్రపంచ సగటు వృద్ధి కంటే నాలుగు శాతం అధికం. అదే విధంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత వృద్ధి మూడు శాతం అధికం. ప్రపంచంలో ముఖ్య ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే 2014-15, 2017-18 మధ్యకాలంలో భారత్ అధిక వృద్ధిరేటు సాధించింది. ఈ కాలంలో దేశ సగటు వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. అల్ప ద్రవ్యోల్బణం, మెరుగుపడిన కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్, ద్రవ్యలోటు తగ్గుదల తదితర అంశాలు అధిక వృద్ధి సాధనకు కారణాలుగా సర్వే పేర్కొంది.
2017లో ప్రపంచంలో అధిక దేశాలు వృద్ధి సాధనలో పురోగతి సాధించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రపంచ జీడీపీ వృద్ధిని 2016లో 3.2 శాతంగా, 2017లో 3.6 శాతంగా అంచనా వేసింది. అదే విధంగా 2018లో 3.9 శాతంగా ఉండగలదని పేర్కొంది. ప్రపంచ వస్తు, సేవల వాణిజ్యంలో వృద్ధి ప్రపంచ జీడీపీ వృద్ధికి కారణమైంది.
ఆర్థిక సర్వే సమీక్ష
1. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో భారత్‌లో వృద్ధి వేగవంతమైంది. వస్తు, సేవల పన్ను అమలు, ఎగుమతుల వృద్ధి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ, ప్రభుత్వరంగ బ్యాంకులను పటిష్టపరిచేందుకు రీక్యాపిటలైజేషన్ ప్యాకేజీ, ట్విన్ బ్యాలెన్స్ షీట్ సమస్యను పరిష్కరించడం తదితర అంశాలు వృద్ధిని వేగవంతం చేశాయి.
2. సహకార సమైఖ్యతత్వం సాధనకు జీఎస్‌టీ కౌన్సిల్ లాంటి పటిష్ట సంస్థాగత యంత్రాంగం ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ సహకార సమాఖ్య టెక్నాలజీ కింది అంశాల సాధనకు ఉపయోగపడగలదు.
4. చమురు ధరలు పెరిగితే ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే సూచనలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పన్ను-జీడీపీ నిష్పత్తి ప్రస్తుత కాలంతో పోల్చితే 80వ దశకంలోనే అధికం.
5. కరెంట్ అకౌంట్ లోటును అధిగమించాలంటే ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించాలి. అభివృద్ధి వ్యూహానికి తగిన మద్దతు కోసం అభిలషణీయ స్థూల ఆర్థిక విధానం అవసరం. తయారీరంగానికి ఊతమివ్వడం ద్వారా అంతర్జాతీయ పోటీతత్వం పెంపొందించుకునేలా ఆ రంగాన్ని ప్రోత్సహించాలి.
6. అధిక వృద్ధి సాధనకు పోటీతత్వంతో కూడిన వినిమయ రేట్లు, ఓపెన్ క్యాపిటల్ ఖాతాలు దోహదపడతాయి.
7. 2016కు ముందు కాలంలో ఇతర దేశాల్లో వృద్ధి క్షీణత కొనసాగుతున్న కాలంలో భారత వృద్ధిరేటులో పెరుగుదల నమోదైంది. కానీ, తర్వాత కాలంలో ఇది తిరగబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న సమయంలో దేశ జీడీపీ వృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తి, పరపతి, పెట్టుబడుల్లో క్షీణత ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పోటీతత్వ ప్రభావాన్ని ఎదుర్కొంది.
ద్రవ్యోల్బణం పెరుగుదల..
కేంద్ర బ్యాంకు లక్షిత ద్రవ్యోల్బణ రేటు 4 శాతాన్ని మించి 2017, డిసెంబర్‌లో 5.2 శాతంగా నమోదైంది. ప్రపంచ చమురు ధరల పెరుగుదల; పండ్లు, కూరగాయల ధరల పెరుగుదల; ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన ఇంటి అద్దె అలవెన్సులు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యాయి. కరెంట్ అకౌంట్ లోటు 2017-18లో పెరిగింది. ఈ లోటు జీడీపీలో 1.5-2 శాతంగా ఉండగలదని అంచనా.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కారణంగా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పెరిగాయి. 2013-14, 2015-16 మధ్యకాలంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మొత్తం జీడీపీలో రెండు శాతం కాగా, అది 2017-18 నాటికి 2.3 శాతానికి పెరిగింది.
ఆర్థిక సర్వే 2017-18 ముఖ్యాంశాలు

- ఉమ్మడి వ్యవసాయ మార్కెట్.
- అసమర్థ విద్యుత్ మార్కెట్లను సంఘటితపరచడం.
- రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించడం.
- సాంఘిక ప్రయోజనాలు అందరికీ అందుబాటు.
- వాయు కాలుష్యాన్ని నివారించడం.
4. చమురు ధరలు పెరిగితే ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే సూచనలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పన్ను-జీడీపీ నిష్పత్తి ప్రస్తుత కాలంతో పోల్చితే 80వ దశకంలోనే అధికం.
5. కరెంట్ అకౌంట్ లోటును అధిగమించాలంటే ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించాలి. అభివృద్ధి వ్యూహానికి తగిన మద్దతు కోసం అభిలషణీయ స్థూల ఆర్థిక విధానం అవసరం. తయారీరంగానికి ఊతమివ్వడం ద్వారా అంతర్జాతీయ పోటీతత్వం పెంపొందించుకునేలా ఆ రంగాన్ని ప్రోత్సహించాలి.
6. అధిక వృద్ధి సాధనకు పోటీతత్వంతో కూడిన వినిమయ రేట్లు, ఓపెన్ క్యాపిటల్ ఖాతాలు దోహదపడతాయి.
7. 2016కు ముందు కాలంలో ఇతర దేశాల్లో వృద్ధి క్షీణత కొనసాగుతున్న కాలంలో భారత వృద్ధిరేటులో పెరుగుదల నమోదైంది. కానీ, తర్వాత కాలంలో ఇది తిరగబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న సమయంలో దేశ జీడీపీ వృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తి, పరపతి, పెట్టుబడుల్లో క్షీణత ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పోటీతత్వ ప్రభావాన్ని ఎదుర్కొంది.
ద్రవ్యోల్బణం పెరుగుదల..
కేంద్ర బ్యాంకు లక్షిత ద్రవ్యోల్బణ రేటు 4 శాతాన్ని మించి 2017, డిసెంబర్‌లో 5.2 శాతంగా నమోదైంది. ప్రపంచ చమురు ధరల పెరుగుదల; పండ్లు, కూరగాయల ధరల పెరుగుదల; ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన ఇంటి అద్దె అలవెన్సులు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యాయి. కరెంట్ అకౌంట్ లోటు 2017-18లో పెరిగింది. ఈ లోటు జీడీపీలో 1.5-2 శాతంగా ఉండగలదని అంచనా.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కారణంగా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పెరిగాయి. 2013-14, 2015-16 మధ్యకాలంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మొత్తం జీడీపీలో రెండు శాతం కాగా, అది 2017-18 నాటికి 2.3 శాతానికి పెరిగింది.
ఆర్థిక సర్వే 2017-18 ముఖ్యాంశాలు
- కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా ప్రపంచ బ్యాంకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీ’లో భారత్ స్థానం మెరుగైంది. ఈ సూచీకి సంబంధించి భారత్ స్థానం 2017లో 130 కాగా, 2018లో 100గా ఉంది.
- ‘నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్’ విస్తరణతో దేశంలోని అన్ని హైకోర్టుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తికానుంది.
- 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనా 6.75 శాతంగా కాగా, 2018-19లో 7- 7.5 శాతంగా ఉంటుందని అంచనా.
- జీఎస్టీ అమలుతో పరోక్ష పన్ను చెల్లింపుదారుల్లో పెరుగుదల 50 శాతంగా ఉంది. పెద్దనోట్ల రద్దు కారణంగా ఫైనాన్షియల్ సేవింగ్స్‌లో పెరుగుదల. రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 2017-18లో 3.3 శాతం. సేవారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదల 2017-18లో 15 శాతం. శ్రామిక చట్టాల సమర్థ అమలుకు సాంకేతికత వినియోగం. సమ్మిళిత వృద్ధి సాధనే ధ్యేయంగా విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం.
- స్థిర ధరల వద్ద స్థూల కలిపిన విలువలో వృద్ధి 2017-18లో 6.1 శాతం. 2017-18లో వ్యవసాయ రంగ వృద్ధి 2.1 శాతం; పారిశ్రామిక రంగ వృద్ధి 4.4 శాతం;సేవారంగ వృద్ధి 8.3 శాతం. గత కొన్నేళ్లుగా ఎగుమతుల్లో వృద్ధి రుణాత్మకం కాగా, 2017-18లో ధనాత్మక వృద్ధి నమోదైంది.
- 2013-14లో పెట్టుబడుల రేటులో అధిక క్షీణత నమోదు కాగా, 2015-16లోనూ ఇదే ధోరణి కొనసాగింది. పెట్టుబడి రేటులో భాగంగా కుటుంబ రంగ వాటాలో తగ్గుదల నమోదు కాగా, ప్రైవేటు కార్పొరేట్ రంగం వాటాలో పెరుగుదల సంభవించింది.
- మొత్తం స్థూల పన్ను రాబడి 2016-17 (ఏప్రిల్-నవంబర్)లో రూ.9.33 లక్షల కోట్లు కాగా, 2017-18లో ఇదే కాలానికి రూ.10.87 లక్షల కోట్లుగా అంచానా. 2017 డిసెంబర్ నాటికి వస్తు, సేవల పన్ను రిజిస్ట్రేషన్లు 9.8 మిలియన్‌లకు చేరాయి. తాజా గణాంకాల ప్రకారం జీఎస్టీ ట్యాక్స్ బేస్ (ఎగుమతులను మినహాంచినప్పుడు) రూ.65-70 లక్షల కోట్లుగా అంచనా. జీఎస్‌టీ ట్యాక్స్ బేస్‌లో రాష్ట్రాల వాటాను పరిశీలిస్తే.. మహారాష్ట్ర 16 శాతం; తమిళనాడు 10 శాతం; కర్ణాటక 9 శాతం; ఉత్తరప్రదేశ్ 7 శాతం; గుజరాత్ 6 శాతం వాటా కలిగి ఉన్నాయి.
- అంతర్జాతీయ వస్తు, సేవల ఎగుమతుల్లో మహారాష్ర్ట, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వరుసగా తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ రాష్ట్రాల వాటా 70 శాతంగా ఉంది.
- జీడీపీలో స్థూల మూలధన సంచయనం (పెట్టుబడి) 2003లో 26.5 శాతం కాగా, 2007లో 35.6 శాతానికి పెరిగి.. 2017లో 26.4 శాతానికి తగ్గింది. జీడీపీలో స్వదేశీ పొదుపు రేటు 2003లో 29.2 శాతం కాగా, 2007లో 38.3 శాతానికి పెరిగి.. 2016లో 29 శాతానికి తగ్గింది. 2007-08 నుంచి 2015-16 మధ్యకాలంలో పెట్టుబడి రేటులో తగ్గుదల 6.3 శాతం కాగా, ఈ మొత్తంలో ప్రైవేటు పెట్టుబడిలో క్షీణత 5 శాతంగా నమోదైంది.
- స్థూల కలిపిన విలువలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 2012-13లో 18.2 శాతం కాగా, 2017-18లో 16.4 శాతానికి తగ్గింది. 2016-17లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 275.7 మిలియన్ టన్నులుగా నమోదైంది.
- భారత్‌ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే భారత్ నెట్; డిజిటల్ ఇండియా కార్యక్రమాలను అమలుచేశారు. 2017 సెప్టెంబర్ చివరి నాటికి టెలికం వినియోగదారుల సంఖ్య 1207 మిలియన్ల కాగా, వీటిలో 502 మిలియన్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాలకు, 705 మిలియన్‌లు పట్టణ ప్రాంతాలకు చెందినవి.
- ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనాల ప్రకారం 2016లో ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 3.4 శాతం.
- 2016 ఏప్రిల్-నవంబర్‌తో పోల్చితే ఏప్రిల్-నవంబర్ 2017లో బొగ్గు; సహజవాయువు; రిఫైనరీఉత్పత్తులు; ఉక్కు; సిమెంటు; విద్యుచ్ఛక్తి ఉత్పత్తి ధనాత్మకం కాగా, ముడి చమురు, ఎరువుల ఉత్పత్తి తగ్గింది.
అంశం | 2015-16 | 2016-17 | 2017-18 |
స్థిర ధరల వద్ద జీడీపీ వృద్ధి (శాతం) | 8 | 7.1 | 6.75 |
ద్రవ్యలోటు (జీడీపీలో శాతం) | 3.9 | 3.5 | 3.2 |
రిటైల్ ద్రవ్యోల్బణం (సగటు) | 4.9 | 4.5 | 3.3 |
ఎగుమతుల వృద్ధి (శాతం) | 15.5 | 5.2 | 12.1 |
విదేశీ మారక ద్రవ్య నిల్వలు (బి. డాలర్లు) | 360.2 | 370 | 409.4 |
పారిశ్రామిక రంగ వృద్ధి (శాతం) | 3.3 | 4.6 | 3.2 |
ఆహార ధాన్యాల ఉత్పత్తి (మి. టన్నులు) | 251.6 | 275.7 | - |
Published date : 17 Mar 2018 12:45PM