Stock Market
ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సుల గురించి వివరించండి?
+
- త్రిపురలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా.. చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సును అందిస్తోంది. ఈ సబ్జెక్టు అధ్యయనం ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్, అసెట్ వాల్యుయేషన్, పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్, మ్యూచువల్, ఇతర ఫండ్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ వంటి అంశాలపై అవగాహన వస్తుంది. దూరవిద్య ద్వారా కూడా దీన్ని పూర్తిచేయవచ్చు.
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.iutripura.edu.in
- బీఎస్‌ఈ సర్టిఫికేషన్ ఆన్ సెక్యూరిటీస్ మార్కెట్స్: ఈ కోర్సు అధ్యయనం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేషన్లపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. ప్రైమరీ, సెకండరీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, టాక్స్ ప్రావిజన్స్, సర్వివలెన్స్, సెన్సెక్స్, ఇతర ఇండెక్స్‌లు, బ్రోకర్స్ బుక్స్, ఎథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ బ్రోకర్స్, సబ్ బ్రోకర్స్, బుక్ బిల్డింగ్, ఇంటర్నెట్ ట్రేడింగ్ వంటి అంశాల గురించి తెలుస్తుంది. ఫైనాన్షియల్ మార్కెట్స్‌పై ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. బీఎస్‌ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న సర్టిఫికేషన్‌ను పూర్తిచేయాలి.
వెబ్‌సైట్: www.bseindia.com
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం ఉండాలి.
వెబ్‌సైట్: www.nseindia.com
స్టాక్ బ్రోకింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి?
+
సెక్యూరిటీల (షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు,బాండ్లు) క్రయవిక్రయాలు సాగించే మార్కెట్ ప్రదేశాన్నే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు. ఈ ప్రక్రియలో స్టాక్ బ్రోకర్ ప్రధాన పాత్ర వహిస్తాడు. వ్యక్తులు లేదా సంస్థల సెక్యూరిటీల క్రయవిక్రయాల విషయంలో స్టాక్ బ్రోకర్ డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా వ్యవహరిస్తాడు. ఈ రంగంలో ఆసక్తిగల వారు ముందుగా సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజిలో తమ పేరును నమోదు చేసుకోవాలి. దీనికోసం రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ట్రై నింగ్ ఉంటుంది. ఇది కాకుండా పెద్ద స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. కోర్సును ఆఫర్ చేస్తోన్న సంస్థలు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ:
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెంబర్‌షిప్ కోర్స్ ఇన్ క్యాపిట ల్ మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
వెబ్‌సైట్: www.icsi.edu
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ డెవలప్‌మెంట్ (న్యూఢిల్లీ):
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ డెవలప్‌మెంట్
వెబ్‌సైట్: www.utiicm.com
ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్, ముంబై: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టాక్ బ్రోకింగ్

మ్యూచ్‌వల్ ఫండ్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్న సంస్థలేవి?
+
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ), సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆన్‌లైన్ కోర్సును అందిస్తుంది. ఇందులో ఈక్విటీ డెరివేటివ్స్, క్యాపిటల్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్, ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, కమోడిటీస్ మార్కెట్ వంటి మాడ్యూల్స్ ఉంటాయి. కనీస విద్యార్హతలు లేకున్నా.. లెక్కల్లో పరిజ్ఞానం, ఇంగ్లిష్ భాష మీద పట్టుంటే చాలు ఈ కోర్సులో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాలకు: www.nseindia.com
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్‌ఈ) ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేసే కోర్సులను కూడా ఎంచుకోవచ్చు. అయితే ఇందుకోసం బీఎస్‌ఈ నిర్వహించే టెస్ట్‌కు హాజరుకావాలి. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో జరిగే ఈ టెస్ట్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. వివరాలకు: www.bseindia.com

ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించిన కోర్సులను తెలపండి?
+
ఆర్థ్ధిక సరళీకరణ నేపథ్యంలో అనేక కొత్త రంగాలు ఊపందుకున్నాయి. ఉద్యోగావకాశాలు వెల్లువెత్తాయి. వీటిలో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. సెక్యూరిటీల (షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు) అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే మార్కెట్ ప్రదేశాన్నే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఈ ప్రక్రియలో స్టాక్ బ్రోక ర్ ప్రధాన పాత్ర వహిస్తాడు. వ్యక్తులు లేదా సంస్థల సెక్యూరిటీల క్రయవిక్రయాల విషయంలో స్టాక్ బ్రోకర్ డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా వ్యవహరిస్తాడు.
కోర్సును ఆఫర్ చేస్తోన్న సంస్థలు:
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్‌ఎస్‌ఈ).
కోర్సు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్.
వెబ్‌సైట్: www.nseindia.com
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ:
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెంబర్‌షిప్ కోర్స్ ఇన్ క్యాపిట ల్ మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
వెబ్‌సైట్: www.icsi.edu
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ డెవలప్‌మెంట్-న్యూఢిల్లీ.
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ డెవలప్‌మెంట్
వెబ్‌సైట్: www.utiicm.com
ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్, ముంబై.
కోర్సు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టాక్ బ్రోకింగ్.