PhD
ఐఐఎస్సీ (బెంగళూరు) నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?
+
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు.. నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్‌డీ కోర్సులకు సీఎస్‌ఐఆర్-నెట్ జేఆర్‌ఎఫ్/డీబీటీ జేఆర్‌ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్; జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్/ గేట్‌లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు
వివరాలకు: www.iisc.ernet.in
వివరాలకు: www.iisc.ernet.in
నెట్ పరీక్ష గురించి వివరించండి?
+
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పరీక్ష నిర్వహిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్‌షిప్‌లకు అభ్యర్థులను ఎంపికచేసేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు/విశ్వవిద్యాలయాల నుంచి కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.
- పీజీలో ఎంచుకున్న సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకొని పరీక్ష రాయాలి.
- మొత్తం మూడు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
పేపర్ 1: అభ్యర్థిలోని టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌లను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
సమయం: 75 నిమిషాలు.
పేపర్ 2: ఆప్షనల్ పేపర్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. సమయం: 75 నిమిషాలు.
పేపర్ 3: ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు ఇవ్వాలి. దీనికి 200 మార్కులు. సమయం: 150 నిమిషాలు.
- ఈ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) నిర్వహిస్తారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ ప్రవేశ విధానాన్ని వివరించండి?
+
పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సంస్థ సంప్రదాయ సైన్స్ కోర్సులపై పరిశోధనలు చేస్తుంది. మానవ వనరుల శాఖ కింద ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రాంలను, పీహెచ్‌డీ ప్రోగామ్స్‌ను అందిస్తోంది. ఈ సంస్థ బయలాజికల్/లైఫ్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్‌లలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్‌లలో ఏదైనా ఒకదాన్ని కెమికల్ సైన్స్‌లలో ఎంపిక చేసుకోవచ్చు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో కెమికల్ సైన్స్‌లో ఎంఎస్సీ లేదా కెమిస్ట్రీ/ఫిజిక్స్/ బయోకెమిస్ట్రీ/ మెటీరియల్ సైన్స్/ బయోఇన్ఫర్మేటిక్స్/ ఫార్మసీ తత్సమాన కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: సీఎస్‌ఐఆర్-జేఆర్‌ఎఫ్/ యూజీసీ జేఆర్‌ఎఫ్‌లు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), సీఎస్‌ఐఆర్-ఎల్‌ఎస్, జేఈఎస్‌టీ/ ఇన్‌స్ఫైర్-పీహెచ్‌డీ/ గేట్‌లో ఉత్తీర్ణతతో పాటు ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.iiserpune.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. అడ్మిషన్ ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది?
+
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ రెండు రకాల ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) సహకారంతో ఫిజిక్స్, ఆస్రో్టిఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. సైన్స్/ఇంజనీరింగ్‌లలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వారు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
జెస్ట్ (JEST), గేట్ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారు రాత పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు.
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా సహకారంతో ఆస్ట్రోనామికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్‌డీ(టెక్) ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్/ఎలక్ట్రానిక్ సైన్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ, లేదా బీటెక్/బీఈ(ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంప్యూటర్ అండ్ ఇంజనీరింగ్) చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.iiap.res.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) నుంచి ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. సంబంధిత వివరాలు తెలపండి?
+
దేశంలోని ప్రమఖ సంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) ఒకటి. ఐఐఎస్‌సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీని అందిస్తోంది. ఏడేళ్ల వ్యవధి గల ఈ కోర్సుకు అర్హత ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్‌గా ప్రథమ శ్రేణి మార్కులతో బీఎస్సీ లేదా తత్సమాన ఉత్తీర్ణత. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. మెకానిక్స్, వేవ్‌మోషన్, థర్మల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ తదితర అంశాలపై ప్రవేశ పరీక్ష ఉంటుంది. వెబ్‌సైట్: www.iisc.ernet.in
దూర విద్యావిధానంలో పీహెచ్‌డీ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)ను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
+
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) పీహెచ్‌డీ (పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్)ను దూరవిద్యా విధానంలో ఆఫర్ చేస్తోంది.
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంఫిల్‌తో పాటు 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీతోపాటు ఐదేళ్ల బోధనానుభవం/వివిధ సంస్థల్లో సీనియర్ స్థాయిలో ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: www.ignou.ac.in

ఎంఏ (ఫిలాసఫీ) పూర్తి చేసి పీహెచ్‌డీ చేయూలనుకుంటున్నాను. మన రాష్ట్రంలో ఏయే యూనివర్సిటీల్లో అవకాశం ఉంది. ప్రవేశ విధానం ఎలా ఉంటుంది?
+
ఉస్మానియూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉంది. పీజీలో కనీసం 55 శాతం మార్కులతో పాటు ఎంఫిల్/ యూజీసీ సీఎస్‌ఐఆర్/ నెట్ ‘గేట్’/ రిసెర్చ్ ఫెలోషిప్/ స్లెట్ (ఆంధ్రప్రదేశ్)/ప్రామాణిక పత్రికల్లో రెండు పరిశోధన అంశాలు ప్రచురణ అరుు ఉండాలి.
వెబ్‌సైట్ : www.osmania.ac.in
రాష్ట్రంలోని పలు ఇతర విశ్వవిద్యాలయూలు ఇవే అర్హ తలతో పీహెచ్‌డీలో ప్రవేశం కల్పిస్తున్నారుు. దరఖాస్తును పరిశీలించి ఇంటర్వ్యూకు పిలుస్తారు. గైడ్‌లను సంప్రదించి పీహెచ్‌డీ అడ్మిషన్ విధానం, దానికి కావాల్సిన అర్హతల గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫర్ చేసే పీహెచ్‌డీ వివరాలు తెలపండి?
+
దేశంలో పీజీ కోర్సులకు ప్రసిద్ధిగాంచిన సంస్థ... బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. డీమ్డ్ యూనివర్శిటీ హోదా గల ఈ సంస్థ... ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ల్లో ప్రవేశం ఉంటుంది. ఇందులో సీటు సాధిస్తే.. మొదటి రెండేళ్లు నెలకు రూ.8 వేలు; తర్వాత మూడేళ్లు నెలకు రూ.12వేల చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా.. అనేక ఇతర స్కాలర్‌షిప్ సౌకర్యాలు పొందవచ్చు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్‌కు ఉపయోగించిన అనేక పరికరాలు ఇక్కడి శాస్తవ్రేత్తలు తయారుచేసినవే. ఇటీవల స్విట్జర్లాండ్ పర్వతసానువుల్లో జరిపిన బిగ్‌బ్యాంగ్ ప్రయోగంలో కూడా ఇందులో విద్యను అభ్యసించిన విద్యార్థులు పాల్గొన్నారు. దీనిని బట్టే ఆ సంస్థ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
సోషల్‌వర్క్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. ఈ అంశంలో ఎంఫిల్, పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోన్న సంస్థలేవి?
+
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ - సోషల్ వర్క్‌లో ఎంఫిల్, పీహెచ్‌డీలను అందిస్తోంది. ఎంఫిల్ కోసం పీజీ స్థారుులో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటారుు.
వివరాల కోసం వెబ్‌సైట్ : www.du.ac.in
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, మహారాష్ట్ర -ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్/ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తోంది.
అర్హత: పీజీలో కనీసం 55 శాతం మార్కులుండాలి. సామాజిక అంశాలపై అభిరుచి, ఆసక్తి గల ఇతర పీజీ అభ్యర్థులకు కూడా ఈ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి అవకాశం ఉంది.
వెబ్‌సైట్ : www.tiss.edu
కార్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్‌లో ఎంఫిల్ కోసం పీజీ (సోషల్‌వర్క్) చేసి ఉండాలి. పీహెచ్‌డీలో ప్రవేశానికీ ఎంఫిల్ చేసి ఉంటే ప్రాధాన్యం.
వెబ్‌సైట్ : www.karveinstitute.org

ఎంఎస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేశాను. అమెరికాలో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి?
+
ముందుగా ఏ అంశంలో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో ఒక నిర్ధారణకు రావాలి. తర్వాత ఎంచుకున్న అంశాన్ని ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల జాబితాను ప్రాధాన్య క్రమంలో రూపొందించుకోవాలి. ఇందుకు కావల్సిన సమాచారం www.i20fever.com వెబ్‌సైట్‌లో లభిస్తుంది. అమెరికాలోని గ్రాడ్యుయేట్ స్కూల్ ర్యాంకింగ్ వివరాలను www.usnews.com/education వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు.
అమెరికాలో విద్యనభ్యసించాలంటే.. జీఆర్‌ఈ, టోఫెల్ వంటి పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి. ప్రముఖ యూనివర్సిటీలో ప్రవేశం పొందాలంటే మాత్రం జీఆర్‌ఈ స్కోర్ 1200, టోఫెల్ స్కోర్ 80పైగా ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్ స్కోర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
తర్వాత పరీక్షల్లో సాధించిన స్కోర్ ఆధారంగా రూపొందించుకున్న ప్రాధాన్య క్రమంలో యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటే స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, రెజ్యుమె, మూడు రిఫరెన్స్ లెటర్లు, స్టడీ సర్టిఫికెట్ల(పదో తరగతి నుంచి ఇటీవల పూర్తి చేసిన డిగ్రీ వరకు)ను జతచేయాలి. ప్రవేశం ఇచ్చే సదరు యూనివర్సిటీ కాల్‌లెటర్‌ను పంపిస్తుంది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) నుంచి పీహెచ్‌డీ చేయడం ఎలా?
+
దేశంలో పరిశోధనలు, విద్యా బోధ నలో ఐఐటీ, ఐఐఎస్‌సీలతో సమానమైన ప్రతిష్ట కలిగిన సంస్థ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)’. బేసిక్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ సంబంధిత విభాగాల్లో ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఐఐఎస్‌ఈఆర్‌కి దేశ వ్యాప్తంగా భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలలో క్యాంపస్‌లు ఉన్నాయి.
ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ చేయాలంటే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత అంశంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/తత్సమాన కోర్సు చేసి ఉండాలి. యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్, జేఆర్‌ఎఫ్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇన్‌సై ్పర్, ఐసీఎంఆర్, ఐసీఏఆర్ వంటి సంస్థలు అందజేసే ఫెలోషిప్‌నకు క్వాలిఫై అయిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వివరాలకు: www.iiserbhopal.ac.in, www.iiserkol.ac.in, www.iisermohali.ac.in, www.iiserpune.ac.in, www.iisertvm.ac.in

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూఢిల్లీ) నుంచి పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. అర్హతలేమిటి?
+
పీహెచ్‌డీ అంటే... మూడు నాలుగేళ్లలో పూర్తి చేసి పట్టాతో బయటపడేది కాదు. ఏ అంశంపై పరిశోధన చేయూలనుకుంటున్నారో ముందుగా నిర్ణరుుంచుకుని ఆ సబ్జెక్టులో నిష్ణాతులైన గైడ్ ఆధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగాలి.
జేఎన్‌యూ ఎకనామిక్స్ స్టడీస్ అండ్ ప్లానింగ్ సెంటర్ ఎంఫిల్/పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిథ్యం కల్పించే విధంగా జేఎన్‌యూలో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి.
పీహెచ్‌డీ కోసం థీసిస్ సమర్పించాలి. ఎంఫిల్‌లో కోర్సు వర్క్, సిద్ధాంత వ్యాసం ఉంటారుు. రెండు సెమిస్టర్లలో నాలుగు సబ్జె క్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎకనామిక్ అనాలిసిస్, లేదా స్టాటిస్టికల్ అండ్ ఎకనోమెట్రిక్ మెథడ్స్‌లో ఒక అంశాన్ని తప్పనిసరిగా, మిగతా మూడు అంశాల్ని ఐచ్ఛికాంశాల నుంచి ఎంపిక చేసుకోవాలి. అనలిటికల్ అంశాలు, సమకాలీన పరిశోధనాంశాలు వీటిల్లో ఉంటాయి.
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) కూడా ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోంది. పీజీ స్థాయిలో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలు 50 శాతం)తో పాటు సంబంధిత అంశంలో ఎంఫిల్ చేసి ఉండాలి. లేదా, సీనియర్ లెవెల్‌లో కనీసం 5 సంవత్సరాలు టీచింగ్/అడ్మినిస్ట్రేషన్/ఇండస్ట్రీ/ప్రొఫెష నల్ అనుభవం కలిగి ఉండాలి.

ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీని ఆఫర్ చేస్తోన్న యూనివర్సిటీలను తెలపండి?
+
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీని ఆఫర్ చేస్తోంది. ఎడ్యుకేషన్, లేదా సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (ఎడ్యుకేషన్) లేదా సంబంధిత సబ్జెక్టులో ఎంఫిల్ డిగ్రీ లేదా యూజీసీ/సీఎస్‌ఐఆర్/నెట్/గేట్/స్లెట్ క్వాలిఫై అయినవారు లేదా యూజీసీ/సీఎస్‌ఐఆర్/ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రీసెర్చ్ ఫెలోషిప్ పొందినవారు లేదా యూనివర్సిటీ గుర్తించిన స్టాండర్డ్ జర్నల్స్‌లో రీసెర్చ్‌కు సంబంధించిన అంశంపై కనీసం రెండు పరిశోధన పత్రాలు ప్రచురించి ఉన్నవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.osmania.ac.in
బెంగళూరులో క్రీస్తు (క్రైస్ట్) యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీని ఆఫర్ చేస్తోంది. మాస్టర్ డిగ్రీతోపాటు ఎంఫిల్ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వెబ్‌సైట్: www.christuniversity.in
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్‌లో పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోంది. 55 శాతం మార్కులతో పీజీతోపాటు ఎంఫిల్ చేసి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి సీనియర్ స్థాయిలో 5 సంవత్సరాలు టీచింగ్/ఇండస్ట్రీ/అడ్మినిస్ట్రేషన్/ ప్రొఫెషనల్ అనుభవం కలిగి ఉన్న వారు అర్హులు. వెబ్‌సైట్: www.ignou.ac.in

పీహెచ్‌డీ - కంప్యూటర్ సైన్స్‌ను ఆఫర్ చేస్తోన్న యూనివర్సిటీలేవి?
+
ఐఐటీ-కాన్పూర్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి ప్రఖ్యాత సంస్థలతోపాటు మన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐఐటీలు పీహెచ్‌డీ (కంప్యూటర్ సైన్స్)ను ఆఫర్ చేస్తున్నాయి.
వాటి వివరాలు..
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ ఆఫర్ చేస్తోన్న పీహెచ్‌డీ (కంప్యూటర్ సైన్స్)లో ప్రవేశం కోసం సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంఫిల్ డిగ్రీ లేదా యూజీ సీ-నెట్/స్లెట్/యూజీసీ రీసెర్చ్ ఫెలోషిప్/యూనివర్సిటీ గుర్తింపు ఉన్న జర్నల్స్‌లో రెండు రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ అయి ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. వెబ్‌సైట్: www.osmania.ac.in
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)-హైదరాబాద్, పీహెచ్‌డీ (కంప్యూటర్ సైన్స్) కోర్సును అందిస్తోంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. వెబ్‌సైట్: www.iiit.net
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్ ఆఫర్ చేస్తోన్న పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్)లో ప్రవేశం కోసం ఎంటెక్/ఎంఈ పూర్తి చేసి ఉండాలి. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్: www.iitk.ac.in
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్-స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, ముంబై అందిస్తోన్న పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్/సిస్టమ్స్‌సైన్స్)లో ప్రవేశానికి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పూర్తి చేసి ఉండాలి. వెబ్‌సైట్: www.tcs.tifr.res.in
పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్)ను ఆఫర్ చేస్తోన్న మరికొన్ని వర్సిటీలు:
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ-పంజాబ్.
వెబ్‌సైట్: www.lpu.in
ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ-
వెబ్‌సైట్: www.niituniversity.in
క్రిస్ట్ యూనివర్సిటీ-బెంగళూరు.

మ్యాథమెటిక్స్ పీహెచ్‌డీని ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి?
+
ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్, మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోంది.
అర్హత: 55 శాతం మార్కులతో సంబంధిత అంశంలో మాస్టర్ డిగ్రీతో పాటు ఎంఫిల్ డిగ్రీ ఉండాలి. అదే విధంగా యూనివర్సిటీ గుర్తింపు పొందిన జర్నల్‌లో రెండు రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ కావాలి. లేదా యూజీసీ- సీఎస్‌ఐఆర్/నెట్/ స్లెట్‌లలో క్వాలిఫై కావాలి. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ - వరంగల్, మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోంది. అర్హత: సంబంధిత అంశంలో మాస్టర్ డిగ్రీ. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి, మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోంది. అర్హత: సంబంధిత అంశంలో మాస్టర్ డిగ్రీ. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వెబ్‌సైట్: www.svuniversity.in