Online Courses
ఆన్‌లైన్ కోర్సుల ప్రాధాన్యత ఏమిటి? ఏయే ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నాయి?
+
ఉన్నత విద్య అంటే ఆసక్తి ఉన్నా.. అందుకు తగిన సమయం చిక్కని వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులకు ఆన్‌లైన్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయి. దేశంలో ఏ మూల నుంచైనా ఈ కోర్సులను పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల పాఠాలను వినే అవకాశం కూడా లభిస్తుంది. ఆన్‌లైన్ కోర్సులను సెల్ఫ్-లెర్నింగ్ పద్ధతి లేదా ప్రొఫెసర్ కేంద్రకంగా ఉండే మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌కు అంతగా ప్రాముఖ్యం లేని సబ్జెక్ట్‌లలో ఈ కోర్సులను సాధారణంగా ఆఫర్ చేస్తారు. ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బట్టి కాల వ్యవధి ఆధారపడి ఉంటుంది. కొన్ని కోర్సులను వారాలపాటు నిర్వహిస్తే.. మరికొన్ని కోర్సులను పూర్తి చేయడానికి ఏడాది సమయం పట్టొచ్చు.
ఆన్‌లైన్ డిగ్రీలకు జాబ్ మార్కెట్‌లో గుర్తింపు కూడా లభిస్తుంది. దేశంలోని చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టాయి. వీటిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌కు సంబంధించి ఆఫర్ చేస్తున్న కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అహ్మదాబాద్ (మైకా), సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఇండియా టుడే గ్రూప్ కూడా మీడియాతోపాటు వివిధ విభాగాలకు సంబంధించిన కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది.