Skip to main content

Media

జర్నలిజం చేయాలనే ఆసక్తి ఉంది. ఈ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
జర్నలిజం కోర్సును డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ విశ్వవిద్యాలయాలు రెగ్యులర్/దూరవిద్య విధానంలో అందిస్తున్నాయి. జర్నలిస్టుకు ముఖ్యంగా ఏది వార్త అని తెలుసుకునే అవగాహన ముఖ్యం. దీంతోపాటు భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఇందులో ముఖ్యంగా రెండు విధులు(రిపోర్టింగ్, ఎడిటింగ్) నిర్వర్తించాల్సి ఉంటుంది. రిపోర్టరు విధి వార్తలను సేకరించటమయితే, ఎడిటర్ పని పత్రికలో వచ్చేలా తీర్చిదిద్దడం. జర్నలిజం కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు..
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం(ఎం.సి.జె) కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 40 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. మాస్టర్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ఏయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.kakatiya.ac.in
  • తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో మాస్టర్స్ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.spmvv.ac.in
  • కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం.. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.yogivemanauniversity.ac.in
  • నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం.. మాస్ కమ్యూనికేషన్‌లో ఎంఏ అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.telanganauniversity.ac.in
  • బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం.. దూరవిద్య విధానంలో మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: దరఖాస్తు చేసుకోవడం ద్వారా.
    వెబ్‌సైట్:  www.braou.ac.in
  • గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.anucde.info
విజువల్ కమ్యూనికేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
  • హైదరాబాద్‌లోని జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్.. విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ అందిస్తోంది. ఈ కోర్సు పూర్తిచేస్తే హిమగిరి ‘జీ’ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ నుంచి అడ్వాన్స్‌డ్ డిప్లొమా సర్టిఫికెట్లు వస్తాయి. అంటే ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు డ్యూయెల్ సర్టిఫికేషన్ లభిస్తుంది. కార్పొరేట్ కమ్యూనికేషన్ డిజైన్‌పై అధికంగా ఫోకస్ చేస్తుంది. డిజైన్‌లోని ప్రాథమిక సూత్రాలపై పట్టు సాధిస్తారు.
    అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2.
    వెబ్‌సైట్:  www.zica.org
  • తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ.. విజువల్ కమ్యూనికేషన్స్‌లో బీఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా 10+2.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.srmuniv.ac.in
  • చెన్నైలోని లయోలా కాలేజ్.. విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా 10+2.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.loyolacollege.edu
  • తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయం.. దూరవిద్య ద్వారా బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్:  www.annamalaiuniversity.ac.in/dde/
  • చెన్నైలో సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలోని దూరవిద్య కేంద్రం.. దూరవిద్య ద్వారా బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2.
    వెబ్‌సైట్:  www.stpetersuniversity.org/cde/
కమ్యూనికేషన్స్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి.
+
  • పుణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్.. కమ్యూనికేషన్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ అందిస్తోంది. బ్రాండ్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, మీడియా మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.simc.edu
  • అహ్మదాబాద్‌లోని ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్.. కమ్యూనికేషన్స్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/ ఎంఐఏసీటీ, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.mica.ac.in
  • నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్.. అడ్వర్‌టైజింగ్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.niaindia.org  
నేను బి.కాం పూర్తి చేశాను. టీవీ రిపోర్టర్‌గా కెరీర్‌లో స్థిరపడాలని ఆశిస్తున్నాను. ఇందుకోసం ఏ కోర్సు చదవాలి? వాటిని అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయగలరు?
+
రిపోర్టింగ్‌ కెరీర్‌ ఎంతో విలక్షణమైంది. ఇందులో రాణించాలంటే విద్యార్హతలకంటే మరెన్నో ఇతర అంశాల్లో పరిజ్ఞానం అవసరం. సమాచారాన్ని వేగంగా సేకరించి తక్కువ సమయంలో అందించగల నేర్పు వాటిలో అత్యంత ముఖ్యమైంది. సహనం, గంటల కొద్దీ పనిచేయగల ఓర్పు, పరిచయూలు, సమాచారాన్ని సేకరించగల నేర్పు, నిరంతర ప్రయూణాలంటే సంసిద్ధత అవసరం. సమాచారాన్ని సేకరించే క్రమంలో భాషా పరిజ్ఞానంపైనా పట్టు సాధించాలి. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో సంప్రదించాల్సిన సందర్భాలు కూడా ఉంటారుు. అందువల్ల చక్కని పబ్లిక్‌ రిలేషన్‌ నైపుణ్యం కూడా అవసరమే. అరుుతే ఇవన్నీ కేవలం అనుభవంలోనే లభిస్తారుు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయనుకుంటే మంచి మీడియూ హౌస్‌లో అడుగుపెట్టండి. దీంతోపాటు జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా అదనపు లాభాలు చేకూర్చుతుంది. దేశంలో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూని కేషన్స్‌ కోర్స్‌ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
బర్కతుల్లా విశ్వవిద్యాలయ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌)- భోపాల్‌:
బ్యాచిలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం.
www.bhbhopal.nic.in
ఇగ్నో (ఢిల్లీ): పి.జి. డిప్లొమా ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌, అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, మీడియూ రంగంలో అనుభవం.
www.ignou.ac.in
భారతీయ విద్యా భవన్‌ (హైదరాబాద్‌):
పి.జి. డిప్లొమా ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూ నికేషన్స్‌ (పార్ట్‌టైం)
ఏపీజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ (ద్వారక): ఎంఏ ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూ నికేషన్స్‌ అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత www.apeejay.edu
మఖన్‌లాల్‌ చతుర్వేది నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ (భోపాల్‌): మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం, ఎంఏ-అడ్వర్టరుుజింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, ఎంఎ- బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిజం, ఎంఎస్సీ- ఎలక్ట్రానిక్‌ మీడియూ, ఎంఏ- మాస్‌ కమ్యూనికేషన్స్‌ అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, ప్రవేశ పరీక్షలో మార్కులు. www.mcu.ac.in
ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్‌ మీడియా) చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సు ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీల గురించి వివరించండి?
+
మఖన్‌లాల్‌ చతుర్వేది రాష్ట్రీయ పత్రకారిత విశ్వ విద్యాలయ, భోపాల్‌- ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్‌ మీడియా) రెండేళ్ల కోర్సును అందిస్తోంది. ఏదైనా అంశం తో గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్‌ కల్పిస్తారు.
వెబ్‌సైట్‌ : www.mcu.ac.in
అన్నా యూనివర్సిటీ, చెన్నై- ఈ యూనివర్సిటీ అందించే ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రవేశానికి విజువల్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్‌ మీడియా/ జర్నలిజంతో గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండాలి లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో కనీసం రెండేళ్ల మీడియా అనుభవం అవసరం.
వెబ్‌సైట్‌ : www.annauniv.edu
బెంగళూర్‌ యూనివర్సిటీ, బెంగళూర్‌ - ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్‌ మీడియా)లో ప్రవేశానికి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు మీడియా అనుభవం తప్పనిసరి లేదా కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండాలి. వెబ్‌సైట్‌ : www.bub.ernet.in
వాయిస్‌ ట్రైనింగ్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోన్న సంస్థలేవి?
+
స్పష్టమైన ఉచ్ఛారణ, గంభీరమైన స్వరం, మాట్లాడే అంశం పట్ల చక్కటి అవగాహన వాయిస్‌ ఆర్టిస్ట్‌కు కావాల్సిన లక్షణాలు. ఇవి ఉన్నా లేకపోయినా వాటిని అభివృద్ధి చేసి వృత్తికి అనుగుణంగా మాట్లాడే విధానాన్ని నేర్పే కోర్సు ‘వాయిస్‌ ట్రైనింగ్‌’. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి రేడియో జాకీ, వీడియో జాకీ, యాంకర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, న్యూస్‌ రీడర్స్‌గా అవకాశాలు ఉంటాయి. వాయిస్‌ ట్రైనింగ్‌ కోర్సుకు ప్రత్యేకమైన విద్యార్హతలు అంటూ ఏమీ లేవు. ఈ రంగంపట్ల అభిరుచి ఉన్న వారెవరైనా ఈ కోర్సు చేయవచ్చు.
కోర్సులు ఆఫర్‌ చేసే సంస్థలు:
ఆర్‌కే ఫిల్మ్స్‌ అండ్‌ మీడియా అకాడమీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్‌: www.rkfma.com
అకాడమీ ఆఫ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌-చండీగఢ్‌
వెబ్‌సైట్‌: www.aofb.in
మనోహర్‌ మహాజన్‌ కోర్స్‌ ఇన్‌ వాయిస్‌ ట్రైనింగ్‌, ముంబై.
వెబ్‌సైట్‌: www.manoharmahajan.in
ఇండియన్‌ వాయిస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ముంబై, న్యూఢిల్లీ, పుణే, బెంగళూరు
వెబ్‌సైట్‌: www.indianvoiceovers.com
ఇన్‌సింక్‌ స్టూడియోస్‌ (నాన్‌డూ బిండే ఆధ్వర్యంలో నడుస్తోంది), ముంబై.
వెబ్‌సైట్‌: www.insyncstudios.com
మాస్టర్‌ స్థాయిలో మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సును అందిస్తున్న వర్సిటీలేవి?
+
మీడియా రంగంలో స్థిరపడాలనుకునే వారు తప్పక చదవాల్సిన కోర్సు మాస్‌ కమ్యూనికేషన్‌. ప్రస్తుతం ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకనుగుణంగా వివిధ వర్సిటీలు కోర్సులకు రూపకల్పన చేశాయి.
మాస్టర్‌ స్థాయిలో ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్‌ మాస్టర్‌ ఆఫ్‌ మాస్‌కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం కోర్సును అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వెబ్‌సైట్‌: www.osmania.ac.in
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌,రేడియో అండ్‌ టెలివిజన్‌, ప్రింట్‌ జర్నలిజం అండ్‌ న్యూమీడియా, కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీస్‌ స్పెషలైజేషన్స్‌తో ఎంఏ (కమ్యూనికేషన్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్‌: www.uohyd.ernet.in
ఆంధ్రావర్సిటీ (www.andhrauniversity.info) -విశాఖ పట్నం, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ (https://teluguuniversity.ac.in) - హైదరాబాద్‌, తెలంగాణ వర్సిటీ (www.telanganauniversity.ac.in) -నిజామాబాద్‌, ఆచార్య నాగార్జున వర్సిటీ (www.nagarjunauniversity.ac.in) -నాగార్జున నగర్‌, గుంటూరు కూడా మాస్టర్‌ స్థాయిలో మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి.
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ వర్సిటీ ఉర్దూ మీడియంలో ఎంఏ (మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం) కోర్సును అందిస్తోంది. వెబ్‌సైట్‌: www.manuu.ac.in
జాతీయ స్థాయిలో ఏషియన్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌-నోయిడా ఎంఎస్సీ(మాస్‌ కమ్యూనికేషన్స్‌)ను అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారు అర్హులు. పంజాబ్‌ టెక్నికల్‌వర్సిటీ ఈ డిగ్రీని ప్రదానం చేస్తోంది.
వెబ్‌సైట్‌: www.aaft.com
భారతీయార్‌ వర్సిటీ-కోయంబత్తూర్‌, దూర విద్యా విధానంలో ఎంఏ (జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌)ను ఆఫర్‌ చేస్తోంది. వెబ్‌సైట్‌: www.bu.ac.in
జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ స్థాయిలో ఎంసీజే కోర్సును అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీటు లభిస్తుంది.
వెబ్‌సైట్‌: www.osmania.ac.in
పీజీస్థాయిలో జర్నలిజం కోర్సును అందిస్తున్న ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు/ యూనివర్సిటీల వివరాలు..
ఆంధ్రాయూనివర్సిటీ (విశాఖపట్నం):
కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌.
అర్హత: ఎంఏ/ఎంకాం/ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ.
వెబ్‌సైట్‌: www.andhrauniversity.info
భారతీయ విద్యాభవన్‌ (హైదరాబాద్‌): కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ (పార్ట్‌-టైం)
ఏపీజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ (ద్వారక): కోర్సు: ఎంఏ-జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌. అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వెబ్‌సైట్‌: www.apeejay.edu
మఖన్‌లాల్‌ చతుర్వేది నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ కమ్యూనికేషన్‌ (భోపాల్‌): కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం, ఎంఏ- అడ్వర్టయిజింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, ఎంఏ- బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిజం, ఎంఎస్సీ- ఎలక్ట్రానిక్‌ మీడియా; ఎంఏ - మాస్‌ కమ్యూనికేషన్స్‌. అర్హత: ఏ కోర్సులో ప్రవేశించాలన్నా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.mcu.ac.in
ఏషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం (చెన్నై): కోర్సులు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జర్నలిజం (ఫొటో జర్నలిజం ఐచ్ఛికాంశంగా). అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.asianmedia.org
ఇవేకాక.. దూరవిద్య విధానంలో ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌కమ్యూనికేషన్స్‌ కోర్సుని అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మీడియా లేదా కమ్యూనికేషన్‌ ఆర్గనైజేషన్‌లో అనుభవం ఉండటం లాభిస్తుంది. వెబ్‌సైట్‌: www.ignou.ac.in
నేను జర్నలిస్టు కావాలనుకుంటున్నా.. దీనికి అర్హతలేంటి? జర్నలిజం కెరీర్‌లోకి ఎలా ప్రవేశించాలి? జీత భత్యాలు ఎలా ఉంటాయో తెలపండి?
+
ఒకప్పుడు జర్నలిజంపై ఆసక్తి ఉన్నా జీతాలు ఆకర్షణీయంగాలేక... ఎక్కువ కెరీర్‌గా ఎంచుకునేవారు కాదు. కానీ, నేడు జర్నలిస్టులకు భారీ వేతనాలతోపాటు డిమాండ్‌ పెరిగింది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, వెబ్‌ మీడియాలు దినదినాభివృద్ధి చెందుతుండటంతో... నవతరానికి మీడియా మంచి కెరీర్‌గా మారుతోంది. జర్నలిజం కెరీర్‌ గురించి తెలియని చాలామంది వార్త సేకరణలో స్వయంగా పాలు పంచుకునే రిపోర్టర్లనే జర్నలిస్టులుగా భావిస్తారు. ఇది వాస్తవం కాదు. రిపోర్టర్లతోపాటు ఆ వార్త బయటి ప్రపంచానికి చేరవేసే పనిలో నిమగ్నమయ్యేవారు మరెందరో ఉంటారు. వీరంతా జర్నలిస్టులే. జర్నలిజం కెరీర్‌... రిపోర్టర్‌, సబ్‌ ఎడిటర్‌, ఫీచర్‌ రైటర్లతో ప్రారంభమవుతుంది.
ఎలక్ట్రానిక్‌ మీడియాలో అయితే రిపోర్టర్లు, కాపీ ఎడిటర్లు, న్యూస్‌ రీడర్లు, స్క్రిప్ట్‌ రైటర్లు, రిసెర్చర్లు, వీడియో ఎడిటర్లు, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ ఎడిటోరియల్‌ సిబ్బంది ఉంటారు. వెబ్‌ మీడియాలో సైతం రిపోర్టర్లు, సబ్‌ ఎడిటర్లు, స్క్రిప్ట్‌ రైటర్లు ఉంటారు. జర్నలిజంలో ప్రవేశానికి కనీస అర్హత డిగ్రీ. దీనితోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, భాషపై పట్టు, సమాజంపై అవగాహన ఉండాలి. తెలుగు పత్రికల్లో పని చేయాలనుకునే వారికి పత్రికా భాష, తేలికైన పదాలతో చిన్న వాఖ్యాలు రాసే నేర్పు, అనువాదం, రాష్ట్రంలో జరుగుతున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై అవగాహన, తెలుగులో కంపోజింగ్‌ చేయగలగటం తప్పనిసరి.
ప్రవేశం ఇలా: మన రాష్ట్రంలో ఆయా దిన పత్రికలకు జర్నలిజం కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రవేశానికి డిగ్రీ చదివి ఉండాలి. వయసు 30 ఏళ్లు లోపు ఉండాలి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, తెలుగు భాష, అనువాదం, రాష్ట్ర, దేశ రాజకీయాలు, వివిధ పరిణామాలపై ప్రశ్నలుంటాయి. ఆయా సంస్థల్లో ఉన్న ఖాళీలకనుగుణంగా సీట్లు భర్తీ చేస్తారు. ఏడాదిపాటు నిర్వహించే ఈ కోర్సులో సై ్టపెండ్‌ కూడా చెల్లిస్తారు.
ఆంగ్ల పత్రికల్లో: ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందూ... ఏషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం పేరుతో చెన్నైలో కోర్సు నిర్వహిస్తోంది. ప్రతిఏటా మే, జూన్‌లో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల్లో పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం కోర్సులను అందిస్తోంది. ఇందుకోసం ఫీజులు చెల్లించాలి. కోర్సు పూర్తయితే ఆ పత్రికలోనే ప్లేస్‌మెంట్స్‌ ఉంటాయి.