Skip to main content

Library Science

లైబ్రరీ సైన్స్‌ కోర్సు చేయూలనుకుంటున్నాను. దూరవిద్య విధానంలో ఈ కోర్సును ఆఫర్‌ చేసే విద్యాసంస్థల గురించి తెలపండి?
+
కింద తెలిపిన విద్యాసంస్థలు దూరవిద్య విధానంలో లైబ్రరీ సైన్స్‌ కోర్సును ఆఫర్‌ చేస్తున్నారుు.
ఎ) వినాయక్‌ మిషన్స్‌, సేలం. లైబ్రరీ సైన్స్‌లో వివిధ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.
  1. సర్టిఫికెట్‌ కోర్సు : కాలవ్యవధి ఆరు నెలలు. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత.
  2. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌. అర్హత: కాలవ్యవధి ఒక సంవత్సరం. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండాలి.
  3. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (బీఎల్‌ఐఎస్‌సీ) అర్హత: కాలవ్యవధి ఒక సంవత్సరం. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
  4. మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (ఎంఎల్‌ఐఎస్‌సీ)
    అర్హత: కాలవ్యవధి రెండు సంవత్సరాలు. సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వెబ్‌సైట్‌ : www.vmudde.ac.in
బి) అలగప్ప విశ్వవిద్యాలయం, కారైకుడి
1) బీఎల్‌ఐఎస్‌సీ : ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
2) ఎంఎల్‌ఐఎస్‌సీ : బీఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్‌ : www.alagappauniversity.ac.in

సి) అన్నామలై విశ్వవిద్యాలయం, అన్నామలైనగర్‌
1) సర్టిఫికెట్‌ ఇన్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ : ఇంటర్మీడియెట్‌/ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్స్‌/ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
2) బీఎల్‌ఐఎస్‌సీ : ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
3) ఎంఎల్‌ఐఎస్‌సీ : బీఎల్‌ఐఎస్‌సీ/ తత్సమానం.
వెబ్‌సైట్‌ : www.annamalaiuniversity.ac.in

ఈ కోర్సు చేసిన వారికి గ్రంథాలయూలు, సమాచారాన్ని భద్రపరిచే సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తారుు. ఈ రంగానికి సంబంధించి పరిశోధన, బోధన విభాగాల్లోనూ పని చేయడానికి అవకాశం ఉంటుంది. డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, ప్రింటింగ్‌, పబ్లిషింగ్‌, పురావస్తు విభాగాల్లో కూడా వీరికి ఉపాధి అవకాశాలు ఉంటారుు.
లైబ్రరీ ఆటోమేషన్‌ కోర్సును రెగ్యులర్‌లోగానీ, దూరవిద్య ద్వారా గానీ అందించే విద్యాసంస్థల వివరాలు తెలపండి?
+
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ, లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌  డిప్లొమాను అందిస్తోంది. లైబ్రరీ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇతర వివరాలకు www.ignou.ac.in  చూడాలి. అలాగే అన్నామలై యూనివర్సిటీ డైరక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
ఈ కోర్సు చేయడానికి బీఎల్‌ఐఎస్సీ/బీఎస్సీ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ఎంఎల్‌ఐఎస్సీ/ఎంఎల్‌ఎస్‌/ఎంఎస్సీ లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ అసోసియేట్‌షిప్‌ ఇన్‌ డాక్యుమెంటేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌లలో ఏదోఒకటి ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర వివరాలకు  https://annamalaiuniversity.ac.in చూడండి.
బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సు చేసిన వారికి ఎటువంటి అవకాశాలుంటాయి?
+
విద్యార్థులకు, పరిశోధన సంస్థలకు లైబ్రరీలో దొరికే మెటీరియల్‌ చాలా ఉపయోగకరంగా ఉంటోంది. దీన్ని సరైన క్రమంలో అమర్చడానికి అవసరమైన క్వాలిఫైడ్‌ లైబ్రేరియన్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వివిధ రకాల పుస్తకాలు, జర్నల్స్‌కు సంబంధించిన రికార్డును క్రమ పద్ధతిలో నిర్వహించడం వంటి విధులను లైబ్రేరియన్‌ నిర్వర్తించాలి. లైబ్రరీ నిర్వహణకు సంబంధించి కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండడం కూడా లాభిస్తుంది. పబ్లిక్‌, ప్రభుత్వ లైబ్రరీలు, యూనివర్సిటీలు, రాయబార కార్యాలయాలు, కన్సల్టెంట్‌లు, ప్రచురణ సంస్థలు, డాక్యు మెంటేషన్‌ సెంటర్లు, న్యూస్‌ఏజెన్సీల్లో వీరికి అవకాశాలుంటాయి.
ఎం.ఎల్‌.ఐ.ఎస్‌.సి. ని దూర విద్యావిధానంలో అందిస్తోన్న యూనివర్సిటీలేవి?
+
మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ను దూర విద్యా విధానంలో అభ్యసించాలంటే ముందుగా బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సులో భాగంగా ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్స్‌, రీసెర్చ్‌ మెథడాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సోర్సెస్‌ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.  దూర విద్యా విధానంలో అందిస్తున్న యూనివర్సిటీల వివరాలు:
ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ; అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో ఉత్తీర్ణత.
వివరాలకు వెబ్‌సైట్‌: www.ignou.ac.in
అన్నామలై యూనివర్సిటీ (డెరైక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌);
అర్హత: బీఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.
వివరాలకు వెబ్‌సైట్‌: www.annamalaiuniversitydde.in
మదురై కామరాజ్‌ యూనివర్సిటీ (డెరైక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌) వివరాలకు వెబ్‌సైట్‌: www.mkudde.org
అలగప్పా యూనివర్సిటీ:
అర్హత బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో ఉత్తీర్ణత.
వెబ్‌సైట్‌: www.alagappauniversity.ac.in
డా’’ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (హైదరా బాద్‌): వెబ్‌సైట్‌: www.braou.ac.in 
బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ:
వెబ్‌సైట్‌: www.bundelkhanduniversity.org/
యశ్వంత్‌రావ్‌ చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ: వెబ్‌సైట్‌: www.ycmou.com
ఆంధ్రా యూనివర్సిటీ (ఎస్‌డీఈ): అర్హత: బీఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత. వెబ్‌సైట్‌ www.andhruniversity.info
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌): వెబ్‌సైట్‌: www.anucde.com