Skip to main content

Languages

పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ గురించి వివరిస్తారా? దీన్ని ఎవరు నిర్వహిస్తారు?
+
పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ ఆధారిత అకడెమిక్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్. యూకే, ఆస్ట్రేలియా విద్యాసంస్థల్లో ప్రవేశానికి దీన్ని నిర్వహిస్తారు. పరీక్ష రాయాలనుకునేవారు ముందుగా పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ అకడెమిక్ పేరున ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్షకు సన్నద్ధం కావాలనుకునేవారికి పియర్సన్ సైట్‌లో స్టడీ మెటీరియల్ లభిస్తుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
పరీక్ష రుసుం: రూ. 9,350.

వెబ్‌సైట్:  www.pearsonpte.com
ఎంఏ (తెలుగు) దూరవిద్య విధానంలో అందిస్తున్న విశ్వవిద్యాలయూలేవి?
+
మన రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయూలు రెగ్యులర్‌, దూరవిద్య విధానంలో ఎంఏ (తెలుగు) కోర్సును అందిస్తున్నారుు. దీనికి సంబంధించిన ప్రకటనలను అన్ని పత్రికలలో ఇస్తుంటారు.
దూరవిద్యలో హిందీ ట్రాన్స్‌లేషన్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోన్న సంస్థలేవి?
+
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఢిల్లీ - హిందీ/ ఇంగ్లిష్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఇంగ్లిష్‌/ హిందీ మీడియంలో ఈ రెండు భాషల్లో ఏదైనా ఒక భాషతో గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు.
వెబ్‌సైట్‌ : www.ignou.ac.in
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, సెంటర్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ - హిందీ ట్రాన్స్‌లేషన్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్‌ :  www.uohyd.ernet.in
నేను డిగ్రీ పాసయ్యాను. సీఫెల్‌లో చేరి ఫ్రెంచ్‌ లేదా జపాన్‌ భాష నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకు ఎన్ని రోజులు కేటాయించాలి. సీఫెల్‌ చిరునామా, వెబ్‌సైట్‌ వివరాలు తెలపండి?
+
ఇఫ్లూ (సీఫెల్‌)లో ఫారెన్‌ లాంగ్వేజెస్‌ను మూడు పద్ధతుల్లో అందిస్తున్నారు. అవి సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా. ఒక్కో కోర్సుకి ఏడాది వ్యవధి ఉంటుంది. సీఫెల్‌  చిరునామా.. ‘ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌, తార్నాక, సికింద్రాబాద్‌’.
వెబ్‌సైట్‌  www.ciefl.ac.in ఫోన్‌ నెం: 040- 27689400, 27098141.
2005లో ఇంటర్‌ (ఎంపీసీ) ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యూను. ఇంగ్లిష్‌లో 86 శాతం మార్కులు వచ్చారుు. ఎంఏ ఇంగ్లిష్‌ డిస్టెన్స్‌ ద్వారా చేయూలని ఉంది. చదువు లో నాలుగేళ్ల గ్యాప్‌ వచ్చినందువల్ల ఏమైనా సమస్యలొస్తాయూ? బీఏ పూర్తి చేసి ఎంఏ చేయడం మంచిదా? డిస్టెన్స్‌లో ఎంఏ ఇంగ్లిష్‌ ఆఫర్‌ చేసే యూనివర్సిటీలు తెలుపండి?
+
చదువులో నాలుగేళ్ల గ్యాప్‌ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. నేరుగా ఎంఏ చేయడం కంటే ముందుగా బీఏ చేయడం మంచిది. ఎందుకంటే పీజీలో మీరు చదివే సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన కోసం ముందుగా అదే సబ్జెక్టులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు చేయడం ఎంతో ఉపకరిస్తుంది. బీఏ(లిటరేచర్‌) చేయడం వల్ల మీకు ఎంఏలో సబ్జెక్టును అవగాహన  చేసుకోవడం సులువవుతుంది.
యూనివర్సిటీల వివరాలు:
వినాయక మిషన్‌ యూనివర్సిటీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, సేలం, బీఏ(ఇంగ్లిష్‌) ఆఫర్‌ చేస్తోంది. ఇంటర్మీడియెట్‌ పాసైన వారు అర్హులు.
వివరాలకు www.vmudde.ac.in చూడొచ్చు.
అన్నామలై యూనివర్సిటీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, అన్నామలైనగర్‌.
వివరాలకు http://annamalaiuniversity.ac.in చూడొచ్చు.
ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌,హైదరాబాద్‌ ఎంఏ (ఇంగ్లిష్‌) అందిస్తోంది. డిగ్రీ ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర వివరాలకు www.efluniversity.ac.in చూడొచ్చు.
భారతీయూర్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, సేలం. బీఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ లేదా పార్ట్‌ 2 ఇంగ్లిష్‌ (నాలుగు సెమిస్టర్లు)గా. ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఇతర వివరాలకు www.bu.ac.in చూడొచ్చు.
ఎంఫిల్‌(హిందీ)ని డిస్టెన్స్‌ విధానంలో ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలేవి?
+
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, డెరైక్టర్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, తిరుపతి దూరవిద్యా విధానంలో ఎంఫిల్‌ (హిందీ)ని ఆఫర్‌ చేస్తుంది.
అర్హత: 50 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ (హిందీ).
వెబ్‌సైట్‌: www.svudde.org.
హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెర్నింగ్‌ ఎంఫిల్‌ (హిందీ)ని ఆఫర్‌ చేస్తుంది.
వెబ్‌సైట్‌: www.hpuniv.nic.in/icdeol.htm
బీఏ (హిందీ, తెలుగు) పూర్తి చేశాను. ట్రాన్స్‌లేటర్‌గా స్థిర పడాలనుకుంటున్నాను. ట్రాన్స్‌లేషన్‌కు సంబంధించి షార్ట్‌టర్మ్‌ కోర్సులను దూర విద్యా విధానంలో అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో), ఢిల్లీ పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ హిందీ-ఇంగ్లిష్‌ కోర్సును అందిస్తోంది. గ్రాడ్యుయేషన్‌ (ఇంగ్లిష్‌, హిందీ) లేదా ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్ట్‌గా హిందీ మాధ్యమంలో గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు దీనికి అర్హులు.
వెబ్‌సైట్‌: www.ignou.ac.in
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ ఇన్‌ హిందీని ఆఫర్‌ చేస్తుంది. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
వెబ్‌సైట్‌: www.uohyd.ernet.in
ఎం.కామ్‌ పూర్తి చేశాను. ఏదో ఒక ఫారిన్‌ లాంగ్వేజ్‌ను నేర్చుకోవాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి?
+
ముందుగా ఏ లాంగ్వేజ్‌ నేర్చుకోవాలనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాలి. ఆ లాంగ్వేజ్‌ మీరు ఎంచుకున్న కెరీర్‌కు ఏ విధంగా దోహదపడుతుందో విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు ఎం.కామ్‌. సంబంధిత రంగంలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకుంటే.. ఏ దేశంలో చదవాలనుకుంటున్నారో అక్కడి భాష నేర్చుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. అలాకాకుండా టీచింగ్‌, ట్రాన్స్‌లేషన్‌ వంటి రంగంలో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయాలనుకుంటే మాత్రం.. ఆసక్తి ఉన్న భాషపై పట్టు సాధించడం మేలు. మన రాష్ట్రంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఫారిన్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి డిప్లొమా నుంచి మాస్టర్‌ డిగ్రీ వరకు కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిల్లో ఏదో ఒక కోర్సులో చేరొచ్చు. తర్వాత అవసరాన్ని బట్టి సంబంధిత అంశంలో అడ్వాన్స్‌డ్‌ కోర్సు చేసే అవకాశం కూడా ఉంది.
ఆఫర్‌ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్‌.
కోర్సులు:
ఎంఏ (అరబిక్‌/ఫ్రెంచ్‌ /పర్షియన్‌)
జూనియర్‌ డిప్లొమా (ఫ్రెంచ్‌/జర్మన్‌/రష్యన్‌)
సీనియర్‌ డిప్లొమా (ఫ్రెంచ్‌/జర్మన్‌/రష్యన్‌)
అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా (ఫ్రెంచ్‌/జర్మన్‌/రష్యన్‌)
వివరాలకు: www.osmania.ac.in
ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ యూనివర్సిటీ-హైదరాబాద్‌.
కోర్సులు:
మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ( అరబిక్‌/ఫ్రెంచ్‌/జర్మన్‌/స్పానిష్‌/రష్యన్‌-ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌)
ఎంఏ(ఆరబిక్‌/ఫ్రెంచ్‌/రష్యన్‌)
అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా (రష్యన్‌)
వివరాలకు: www.efluniversity.ac.in
అలియెన్స్‌ ఫ్రాంచైజ్‌-హైదరాబాద్‌.
కోర్సు: డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫ్రెంచ్‌.
వివరాలకు: http://hyderabad.afindia.org
డిస్టెన్స్‌ విధానంలో ఇంగ్లిష్‌ టీచింగ్‌కు సంబంధించిన కోర్సులను ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీలేవి?
+
ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో) ఇంగ్లిష్‌ టీచింగ్‌కు సంబంధించి సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.ignou.ac.in
మన రాష్ట్రంలోని ది ఇంగ్లిష్‌ అండ్‌ ఫారీ న్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ-దూర విద్యా విభాగం ఇంగ్లిష్‌ టీచింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యు యేట్‌ సర్టిఫికెట్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. ఎంఏ (ఇంగ్లిష్‌) చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు (ఇంగ్లిష్‌ టీచర్లకు ప్రాధాన్యం ఇస్తారు).
వెబ్‌సైట్‌: www.efluniversity.ac.in
ఎంఏ(సంస్కృతం) కోర్సును ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలేవి?
+
ఎంఏ(సంస్కృతం) కోర్సును ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీలు
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్‌.
అర్హత: సంస్కృతం ఒక సబ్జెక్ట్‌గా కనీసం 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా
వివరాలకు: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వివరాలకు: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వివరాలకు: www.andhrauniversity.info
ఫ్రెంచ్‌ లేదా జపనీస్‌ భాష నేర్చుకోవాలనుకుంటున్నాను. రాష్ట్రంలో విదేశీ భాషలను నేర్పే సంస్థల వివరాలు తెలపండి?
+
గతంలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ (సీఫెల్‌) పేరుతో పిలిచే విదేశీ భాష అధ్యయన సంస్థ... ఇపుడు ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఈఎఫ్‌ఎల్‌యూ)గా మారింది. దీనికి కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా కూడా కల్పించారు. కాబట్టి మరింత నాణ్యమైన విద్య ఇక్కడ లభిస్తుంది. ఈ సంస్థ హైదరాబాద్‌లోని ఉస్మానియూ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంది. ఇక్కడి విద్యాప్రమాణాలు అంతర్జాతీయ స్థారుులో ఉంటాయి.
వెబ్‌సైట్‌ : www.efluniversity.ac.in చూడొచ్చు.