Skip to main content

Integrated Courses

ఇంటిగ్రేటెడ్‌ పీజీతో ప్రయోజనాలేంటి? ఏ గ్రూప్‌ లో ప్రవేశించడం అభిలషణీయం?
+
ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో కోర్సులు పూర్తి చేయాలను కున్న వారికి ఇంటిగ్రేటెడ్‌ పీజీలు ఎంతో ప్రయోజన కరం. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా వీటి సిల బస్‌ను రూపొందిస్తున్నారు. విద్యార్థులు జ్ఞానాన్ని సముపార్జించేందుకు వీలుగా... అతి ముఖ్యమైన, అవసరమైన అంశాల బోధన, అప్లికబిలిటీ ఉండే విధంగా కోర్సుల రూపకల్పన జరుగుతోంది. పాఠ్యాంశాలపై లోతైన విశ్లేషణ, ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వడం ఇంటిగ్రేటెడ్‌ ప్రత్యేకత. డిగ్రీ, పీజీలను సమ్మిళితం చేస్తున్న ఈ పీజీల పట్ల ఇప్పుడు విద్యార్థుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రవేశానికి ఇంటర్మీడియెట్‌ అర్హత కావడంతో.. ఏ కెరీర్‌లో స్థిరపడవచ్చో ముందుగానే ఒక అవగాహన పొందే వీలుంటుంది. అంతేకాక డిగ్రీ తర్వాత పీజీ కోసం ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాల్సిన పరిస్థితికి ఇంటిగ్రేటెడ్‌ పీజీలతో స్వస్తి పలకొచ్చు. ప్రస్తుతం ఆర్ట్స్‌, సైన్స్‌, లా,ఇంజినీరింగ్‌   ఇలా.. అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సులు అందుబా టులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండ లి సూచన ప్రకారం.. మన రాష్ట్రంలో ప్రతి యూనివ ర్సిటీ కనీసం ఒక విభాగంలోనైనా ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులను అందుబాటులో ఉంచాలి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు సాధారణంగా మార్చి నుంచి మే నెలలోపు విడుదలవుతాయి.
మన రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీని ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీలేవి?
+
మన రాష్ట్రంలోని ఆంధ్రా, ఉస్మానియా, కాకతీయ యూని వర్సిటీలు పలు సబ్జెక్ట్‌లతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీని అందిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ కింది పేర్కొన్న సబ్జె క్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌ చేస్తోంది.
అప్లయిడ్‌ కెమిస్ట్రీ: 50 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ/ బైపీసీ)పూర్తి చేసిన వారు అర్హులు.
ఎకనామిక్స్‌: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్‌: www.andhrauniversity.info
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌: 50 శాతం మార్కు లతో ఇంటర్‌(ఎంపీసీ)పూర్తి చేసిన వారు అర్హులు.
ఉస్మానియా వర్సిటీ: ఇంటిగ్రేటేడ్‌ ఎంఎస్సీ(కెమిస్ట్రీ, ఫార్మా స్యుటికల్‌ కెమిస్ట్రీ)ని అందిస్తోంది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సీటీ-వరంగల్‌, ఇంటిగ్రేటేడ్‌ ఎంఎస్సీ (కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ)ని ఆఫర్‌ చేస్తోంది.
రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.kuwarangal.com
నేను ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాను. ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ విధానం గురించి తెలియజేయగలరు. ఆ డిగ్రీ పూర్తి చేస్తే లభించే అవకాశాలేంటి?
+
ఇంటర్మీడియెట్‌ తర్వాత ఐదేళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులను దేశంలో పలు యూనివర్సి టీలు ప్రవేశపెట్టారుు. ప్రతి యూనివర్సిటీలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సు ప్రవేశపెట్టాలన్న ఉన్నత విద్యా మండలి ఆదేశంలో మన రాష్ట్రంలో కూడా ప్రతి యూనివ ర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నా రుు. ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌ విభాగాల్లో ఈ కోర్సుల ను బోధిస్తున్నారు. ఇంటర్మీడియెట్‌లో చదివిన గ్రూప్‌ ఆధా రంగా సంబంధిత పీజీలో చేరాల్సి ఉంటుంది. ఈ కోర్సు లో మెుదటి మూడేళ్లు డిగ్రీ స్థారుు సబ్జెక్టులను, తర్వాత రెండేళ్లు పీజీ స్థారుు అంశాలను బోధిస్తారు.
నేను ఇంటర్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఇంటిగ్రేటెడ్‌ పీజీతో ప్రయోజనాలేంటి? ఏ గ్రూప్‌లో ప్రవేశించడం మంచిది?
+
అ ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో కోర్సులు పూర్తి చేయాలనుకున్న వారికి ఇంటిగ్రేటెడ్‌ పీజీలు ఎంతో ప్రయోజనకరం. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా విద్యార్థులు జ్ఞానాన్ని సముపార్జించేందుకు వీలుగా... అతి ముఖ్యమైన, అవసరమైన అంశాల బోధన, అప్లికబిలిటీ ఉండే విధంగా కోర్సుల రూపకల్పన జరిగింది. పాఠ్యాంశాలపై లోతైన విశ్లేషణ, ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వడం ఇంటిగ్రేటెడ్‌ ప్రత్యేకత. డిగ్రీ, పీజీలను సమ్మిళితం చేస్తున్న ఈ పీజీల పట్ల విద్యార్థుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రవేశానికి ఇంటర్మీడియెట్‌ అర్హత కావడంతో.. ఏ కెరీర్‌లో స్థిరపడవచ్చో ముందుగానే అవగాహనకు వచ్చే వీలుంటుంది.  ప్రస్తుతం ఆర్ట్స్‌, సైన్స్‌, లా, ఇంజినీరింగ్‌ ఇలా.. అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మార్చి- మే లోపు నోటిఫికేషన్లు విడుదలవుతాయి.