Skip to main content

Geologist

జియాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీ, మూడేళ్ల వ్యవధి గల అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ(టెక్)లను అందిస్తోంది.
అర్హత:
సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది.
అర్హత:
జియాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.svuniversity.ac.in
 
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది.
అర్హత:
కనీసం 40 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in

వీటితోపాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం (www.du.ac.in), పుణె విశ్వవిద్యాలయం (www.unipune.ac.in) వంటివి కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.
జియో ఇన్ఫర్మాటిక్స్ కోర్సును ఏయే ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి?
+
జియో సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ రెండింటిలోని అంశాల సమ్మిళితమే జియోఇన్ఫర్మాటిక్స్ కోర్సు. జియోఇన్ఫర్మాటిక్స్ ప్రొఫెషనల్స్‌కు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, హైదరాబాద్), నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్‌ఈఎస్‌ఏసీ- షిల్లాంగ్), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో-బెంగళూరు), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) లాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోని సంస్థలు, పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. వీటితోపాటు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల్లోనూ కెరీర్ ప్రారంభింవచ్చు. ప్రైవేట్ రంగంలో నేషనల్ సర్వే-మ్యాపింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ఖనిజ అన్వేషణ, అత్యవసర సేవలు, ప్రజారోగ్యం, క్రైమ్ మ్యాపింగ్, రవాణా-మౌలిక సదుపాయాలు, ట్రావెల్-టూరిజం, మార్కెట్ విశ్లేషణ, ఈ-కామర్స్ కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ సంస్థలు (గూగుల్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఎనర్జీ, మాగ్నాసాఫ్ట్ టెక్నాలజీ సర్వీసెస్ తదితర) జియో ఇన్ఫర్మాటిక్స్ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. జియోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. జియోఇన్ఫర్మాటిక్స్‌లో బీటెక్ అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • న్యూఢిల్లీలోని టెరీ యూనివర్సిటీ.. జియోఇన్ఫర్మాటిక్స్‌లో పీజీ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 6.75 గ్రేడ్ పాయింట్ యావరేజ్ లేదా 60 శాతం మార్కులతో సైన్స్/ ఇంజనీరింగ్/ మ్యాథమెటిక్స్/కంప్యూటర్స్/ స్టాటిస్టిక్స్/ జియాలజీ/జాగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.teriuniversity.ac.in
  • పుణేలోని సీడాక్.. జియోఇన్ఫర్మాటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమానం లేదా అప్లైడ్ సెన్సైస్/జియాలజీ/ఫిజిక్స్/ కంప్యుటేషనల్ సెన్సైస్/ మ్యాథమెటిక్స్‌లో పీజీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.cdac.in
  • జార్ఖండ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ.. జియోఇన్ఫర్మాటిక్స్‌లో పీజీ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 55 శాతం మార్కులతో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫారెస్ట్రీ/ కెమిస్ట్రీ/ఫిజిక్స్/ జియాలజీ/ జియోఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ అగ్రికల్చర్/ ఎలక్ట్రానిక్స్/ జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా కనీసం 55 శాతం మార్కులతో బీఆర్క్/బీఈ లేదా బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.cuj.ac.in
జియాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీ, మూడేళ్ల వ్యవధి గల అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ(టెక్)లను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది.
    అర్హత: జియాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.svuniversity.ac.in
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది.
    అర్హత: కనీసం 40 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • వీటితోపాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం (www.du.ac.in ), పుణె విశ్వవిద్యాలయం (www.unipune.ac.in) వంటివి కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు: యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులవటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్‌ట్రాక్షన్ వంటి రంగాల్లో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చు.
ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?
+
రాతపరీక్షలో విజయం సాధించిన వారు తర్వాతి దశలో ఉండే ఇంటర్వ్యూకు హాజరు కావల్సి ఉంటుంది. ఇందుకోసం 200 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థిలోని స్కిల్స్‌ను మాత్రమే పరీక్షిస్తారు. ఎంచుకున్న పోస్టుకు కావల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా? నాయకత్వ లక్షణాలు, చొరవ, మేథో సామర్థ్యం తదితర అంశాలను పరీక్షిస్తారు.
హైడ్రోజియలాజీ పేపర్‌ ఏవిధంగా ఉంటుంది?
+
జియాలజీ పేపర్ల మాదిరిగానే ఇందులో కూడా సెక్షన్‌-ఎ, బి,సి,డి,ఈ అని ఐదు భాగాలు ఉంటాయి. సెక్షన్‌-ఎలో ఆర్జిన్‌, అకరెన్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ వాటర్‌, సెక్షన్‌-బిలో వెల్‌ హైడ్రాలీస్‌ అండ్‌ వెల్‌ డిజైన్‌, సెక్షన్‌-సిలో గ్రౌండ్‌ వాటర్‌ కెమిస్ట్రీ, సెక్షన్‌-డి గ్రౌండ్‌ వాటర్‌ ఎక్స్‌ప్లోరేషన్ట్‌,సెక్షన్‌-ఈలో గ్రౌండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రాబ్లమ్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జియాలజీ పేపర్‌-3 ఏయే అంశాలు ఉంటాయి?
+
జియాలజీ పేపర్‌-3ని.. సెక్షన్‌-ఎ, బి,సి,డి,ఈ అని ఐదు భాగాలుగా విభజించారు.  సెక్షన్‌-ఎలో ఇండియన్‌ మినరల్స్‌ డిపాజిట్స్‌ అండ్‌ మినరల్‌ ఎకనామిక్స్‌, సెక్షన్‌-బిలో ఓరే జెన్సిస్‌, సెక్షన్‌-సిలో మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌, సెక్షన్‌-డిలో జియాలజీ ఆఫ్‌ ఫూయల్స్‌, సెక్షన్‌-ఈలో ఇంజనీరింగ్‌ జియాలజీ  విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జియాలజీ పేపర్‌-2 ఏవిధంగా ఉంటుంది?
+
ఇందులో కూడా పేపర్‌-1 మాదిరిగానే సెక్షన్‌-ఎ, బి,సి,డి,ఈ అని ఐదు భాగాలు ఉంటాయి. సెక్షన్‌-ఎలో మైనరాలజీ,, సెక్షన్‌-బిలో Igneous and Metamorphic Petrology, సెక్షన్‌-సిలో Sedimentology, సెక్షన్‌-డిలో జియోకెమిస్ట్రీ,సెక్షన్‌-ఈలో ఎన్విరాన్‌మెంటల్‌ జియాలజీ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జియాలజీ పేపర్‌-1లో ఏయే అంశాలు ఉంటాయి?
+
జియాలజీ పేపర్‌-1ని..సెక్షన్‌-ఎ, బి,సి,డి,ఈ అని ఐదు భాగాలుగా విభజించారు. సెక్షన్‌-ఎలో జియోమర్ఫాలజీ, రిమోట్‌సెన్సింగ్‌ సంబంధిత అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-బిలో స్ట్రక్చరల్‌ జియాలజీ, సెక్షన్‌-సిలో జియోటెక్‌టానిక్స్‌, సెక్షన్‌-డిలో స్టాటీగ్రఫి, సెక్షన్‌-ఈలో పాలినియోటాలజీ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ ఏవిధంగా ఉంటుంది?
+
 ఈ విభాగంలో ఇంగ్లిష్‌ ఒక షార్ట్‌ ఎస్సే రాయాల్సి ఉంటుంది. మిగతా ప్రశ్నలు అభ్యర్థిలోని ఇంగ్లిష్‌ భాష సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి.
రాత పరీక్షలో ప్రశ్నలు ఏస్థాయిలో ఉంటాయి?
+
రాత పరీక్షలో జియాలజికల్‌ సబ్జెక్టుపై ఇచ్చే ప్రశ్నలు సాధారణంగా మాస్టర్‌ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. వివిధ అంశాల్లో అభ్యర్థుల ప్రాథమిక విజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఈ సబ్జెక్టులకు సంబంధించి ఎటువంటి ప్రాక్టీకల్‌ టెస్ట్‌ను నిర్వహించరు.
జియాలజిస్ట్‌ ఎంపిక ప్రక్రియ, ఎగ్జామ్‌ స్కీమ్‌ ఏవిధంగా ఉంటుంది?
+
జియాలజిస్ట్‌ ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. అవి..రాత పరీక్ష, ఇంటర్వ్యూ. రాతపరీక్షలో ఐదు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు: 900. సమయమం: ప్రతి పేపర్‌కు 3 గంటలు. అవి.. జనరల్‌ ఇంగ్లిష్‌ (మార్కులు-100);జియాలజీ పేపర్‌-1(మార్కులు-200); జియాలజీ పేపర్‌-2 (మార్కులు-200); జియాలజీ పేపర్‌-3 (మార్కులు-200); హైడ్రోజియాలజీ (మార్కులు-200); కేటాయించిన మార్కులు 900. అన్ని పేపర్లకు సమాధానాలను కన్వెన్‌షన్‌ టైప్‌ (ఎస్సే పద్ధతిలో)లో ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో విజయం సాధించిన వారికి నిర్వహించే ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు.
యూపీఎస్‌సీ నిర్వహించే జియాలజిస్ట్‌ ఎగ్జామ్‌కు సంబంధించిన వివ రాలను తెలపండి?
+
జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌  గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌ వంటి విభాగాల్లో వివిధ కేటగిరీల కింద జూనియర్‌ హైడ్రో జియాలజిస్ట్‌, అసిస్టెంట్‌ హైడ్రో జియాలజిస్ట్‌ వంటి పోస్టుల భర్తీ కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ప్రతి ఏడాది  జియాలజిస్ట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తోంది. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీ/మెరైన్‌ జియాలజీలో మాస్టర్‌ డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు. సంబంధిత  నోటిఫికే షన్‌ ప్రతి ఏడాది ఆగస్టులో వెలువడుతుంది. వెబ్‌సైట్‌: www.upsc.gov.in