Skip to main content

రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రభుత్వ పారామెడికల్‌ కళాశాలల్లో పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ పారామెడికల్‌ బోర్డ్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

Question
రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రభుత్వ పారామెడికల్‌ కళాశాలల్లో పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ పారామెడికల్‌ బోర్డ్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
కళాశాలలు:
ఆంధ్రా మెడికల్‌ కళాశాల-విశాఖపట్నం
రంగరాయ మెడికల్‌ కళాశాల-కాకినాడ
సిద్ధార్థ మెడికల్‌ కళాశాల-విజయవాడ
గుంటూరు మెడికల్‌ కళాశాల-గుంటూరు
కర్నూల్‌ మెడికల్‌ కళాశాల-కర్నూల్‌
ఎస్‌వీ మెడికల్‌ కళాశాల-తిరుపతి
రిమ్స్‌-కడప
గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాల-అనంతపూర్‌
కాకతీయ మెడికల్‌ కళాశాల-వరంగల్‌
ఉస్మానియా మెడికల్‌ కళాశాల-హైదరాబాద్‌
ప్రభుత్వ ఛాతీ హాస్పిటల్‌-హైదరాబాద్‌
గాంధీ మెడికల్‌ కళాశాల-సికింద్రాబాద్‌
ఎంఎన్‌జేఐ ఆఫ్‌ అంకాలజీ-హైదరాబాద్‌ (సీట్లు అన్ని జిల్లాలవారికి)
ఐపీఎం అండ్‌ ఎఫ్‌ఎల్‌-హైదరాబాద్‌ (సీట్లు అన్ని జిల్లాలవారికి)
సరోజినీదేవి కంటి ఆస్పత్రి అండ్‌ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆఫ్తాల్మాలజీ
సీట్లు: పై అన్ని కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొత్తం 1462 సీట్లు ఉన్నాయి.

కోర్సులు-అర్హతలు:
డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్స్‌
డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రీ టెక్నీషియన్‌
డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ ఫుడ్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నీషియన్‌
అర్హత: పై కోర్సులన్నింటికి పదోతరగతి ఉత్తీర్ణత
వ్యవధి: రెండేళ్లు

సర్టిఫికేట్‌ ఇన్‌ ఈసీజీ టెక్నీషియన్‌
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
వ్యవధి: ఏడాది

సర్టిఫికేట్‌ ఇన్‌ కార్డియాలజీ టెక్నీషియన్‌
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
వ్యవధి: ఏడాది డిప్లొమా ఇన్‌ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌
డిప్లొమా ఇన్‌ ఆడియోమెట్రీ టెక్నీషియన్‌
డిప్లొమా ఇన్‌ రేడియోథెరపీ టెక్నీషియన్‌
డిప్లొమా ఇన్‌ పర్‌ఫ్యూషన్‌ టెక్నీషియన్‌
డిప్లొమా ఇన్‌ డయాలిసిస్‌
డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌
డిప్లొమా ఇన్‌ రెస్పిరేటరీ థెరపీ
డిప్లొమా ఇన్‌ మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌
డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌ థెరపీ
అర్హత: పై అన్నికోర్సులకు ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణత
వ్యవధి: రెండేళ్లు సర్టిఫికేట్‌ ఇన్‌ అనస్థీషియా టెక్నీషియన్‌
సర్టిఫికేట్‌ ఇన్‌ క్యాత్‌ల్యాబ్‌ టెక్నీషియన్‌
సర్టిఫికేట్‌ ఇన్‌ బ్లడ్‌బ్యాంక్‌ టెక్నీషియన్‌
సర్టిఫికేట్‌ ఇన్‌ డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌
సర్టిఫికేట్‌ ఇన్‌ రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌
అర్హత: పై అన్ని కోర్సులకు ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణత
వ్యవధి: ఏడాది

నోట్‌: సంబంధిత కోర్సులకు బైపీసీ ఉత్తీర్ణులు లేకపోతే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. సీట్లు: ఆయా జిల్లాల్లో ఉన్న కళాశాలల్లో ఆయా జిల్లాల అభ్యర్థులకు 85 శాతం సీట్లు ఉంటాయి. మిగతా 15 శాతం నాన్‌లోకల్‌ సీట్లు.
ట్యూషన్‌ ఫీజు: అన్ని కోర్సులకు నెలకు Rs. 500
దరఖాస్తు విధానం: సంబంధిత కళాశాల లేదా www.appmb.org నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ పేరుమీద Rs. 100 డీడీ తీసి దాంతోపాటు సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి సంబంధిత కళాశాలకు పంపాలి.

వెబ్‌సైట్‌: www.appmb.org

Photo Stories