Skip to main content

పారామెడికల్ కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలపండి?

- శ్రీలత, వేములవాడ.
Question
పారామెడికల్ కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలపండి?
  • విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలు పారామెడికల్ కోర్సులు(బీఎస్సీ ఎంఎల్‌టీ) అందిస్తున్నాయి. వాటిలో కొన్ని..
    • హైదరాబాద్‌లోని శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ ఎంఎల్‌టీ
    • హైదరాబాద్‌లోని కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సెన్సైస్.
  • హైదరాబాద్‌లోని దేవీ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ.
    అర్హత: బైపీసీతో ఇంటర్మీడియెట్ లేదా డీఎంఎల్‌టీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.ntruhs.ap.nic.in
  • నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. పారామెడికల్ కోర్సుల్లో డిప్లొమాను అందిస్తోంది.
    అర్హత: ఏదైనా సైన్స్ సబ్జెక్టుతో బీఎస్సీ
    వెబ్‌సైట్: www.nims.edu.in
  • హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్.. బీఎస్ ఆప్టోమెట్రీని అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఇది నాలుగేళ్ల కోర్సు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, బిట్స్ పిలానీకి దరఖాస్తు చేసుకోవటం ద్వారా ప్రవేశం పొందవచ్చు.
    వెబ్‌సైట్: http://www.lvpei.org/education  

Photo Stories