Skip to main content

ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ (డైరీయింగ్‌) కోర్సు చదువుతున్నాను. ఈ అంశంలో ఉన్నత చదువుల కోసం కోర్సులు ఏమైనా ఉన్నాయూ? ఉపాధి అవకాశాలు...

Question
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ (డైరీయింగ్‌) కోర్సు చదువుతున్నాను. ఈ అంశంలో ఉన్నత చదువుల కోసం కోర్సులు ఏమైనా ఉన్నాయూ? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటారుు?

అంతర్జాతీయ డైరీ మార్కెట్‌లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ తయూరయ్యే పాల ఉత్పత్తులు, అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలు, నాణ్యత కలిగి ఉండటంతో మన దేశానికి మంచి ఖ్యాతి లభిస్తోంది. ఫలితంగా ఈ పరిశ్రమ భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించగలదన్నది నిపుణులు అభిప్రాయం. 2020 నాటికి దేశంలో పాల ఉత్పత్తి 168 మిలియన్‌ టన్నులకు చేరుకోనుంది. పబ్లిక్‌, ప్రైవేట్‌, సహకార రంగాల్లో భారీ ఆధునిక డైరీ ప్లాంట్స్‌ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగినట్టుగా పెద్ద సంఖ్యలో మానవ వనరులు కూడా అవసరం.
ఉన్నత విద్యావకాశాలు - డైరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సులు ఉన్నాయి. ‘ఇగ్నో’ దూరవిద్య విధానంలో పీహెచ్‌డీ, డిప్లొమా ఇన్‌ డైరీ టెక్నాలజీ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. డిప్లొమా కోర్సును ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సహకారంలో అందిస్తోంది. డైరీ పరిశ్రమలో టెక్నీషియన్‌ స్థాయి మానవ వనరులను కల్పించాలనే ఉద్దేశంతో ఈ కోర్సు రూపొందించారు. డైరీ ప్లాంట్స్‌ లో ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫ్‌ మిల్క్‌, ఫూడ్‌ మిల్క్‌ ప్రాసెసింగ్‌, ప్రొడక్షన్‌ ఆఫ్‌ వ్యాల్యూ యూడెడ్‌ ప్రొడక్ట్‌, క్వాలిటీ కంట్రోల్‌ యూక్స్పెక్ట్స్‌కు సంబంధించిన అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. డిప్లొమా కోర్సులో చేరేందుకు 10+2 ఉత్తీ ర్ణులు, ‘ఇగ్నో’ అందిస్తోన్న బ్యాచ్‌లర్‌ ప్రిపరేటరీ ప్రోగ్రాం (బీపీపీ) చేసిన అభ్యర్థులు అర్హులు.

Photo Stories