Skip to main content

హార్టికల్చర్‌ కోర్సు వివరాలను తెలపండి?

Question
హార్టికల్చర్‌ కోర్సు వివరాలను తెలపండి?

మన రాష్ట్ర ప్రభుత్వం 2007-08 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక హార్టికల్చర్‌ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని వెంకటరామన్న గూడెంలో ప్రారంభించింది. యూనివర్సిటీతోపాటు అను బంధంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మోజెర్ల, కడప జిల్లా అనంతరాజుపేట, హైదరాబాద్‌లోని ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలోని హార్టికల్చర్‌ విభాగంలో కళాశాలల్ని కూడా ప్రారంభించారు. వీటిలో హార్టికల్చర్‌ సైన్స్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నారుు. బీఎస్సీ (హార్టికల్చర్‌)కి అర్హత ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్‌, బయాలజీ సబ్జెక్టులు లేదా అగ్రికల్చరల్‌ ఓకేషనల్‌ కోర్సు. ఎంసెట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌:  www.aphu.edu.in

దేశంలో వ్యవసాయ పరిశోధనలో ప్రసిద్ధిగాంచిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ప్రతి ఏటా హార్టికల్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యా బోధన కేంద్రాల్లో 15 శాతం సీట్లను కేటాయిస్తారు. ఈ పరీక్ష నోటిఫికేషన్‌ ప్రతి ఏటా డిసెంబర్‌ లేదా జనవరి నెలల్లో వెలువడుతుంది.
వెబ్‌సైట్‌: www.icar.org.in

Photo Stories