Skip to main content

ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీలేవి?

Question
ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీలేవి?
మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 12 డిసిప్లెయిన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోంది. అర్హత: బీఎస్సీ(సీఏబీఎం)లేదా బీఎస్సీ(అగ్రికల్చరల్‌). ఇవేకాకుండా ఎంఎస్సీ(అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ), ఎంఎస్సీ (అగ్రి విత్‌ వాటర్‌ మేనేజ్‌మెం ట్‌), ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌), మాస్టర్‌ ఆఫ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను కూడా ఈ వర్సిటీ అందిస్తోంది.
వివరాలకు: www.angrau.net
యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సెన్సైస్‌, గాంధీ కృషి విజ్ఞాన్‌ కేంద్ర-బెంగళూరు, వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోంది. అంతే కాకుండా ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ విత్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ ఇంజనీరింగ్‌/పోస్ట్‌ హార్వెస్ట్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌) కోర్సులను కూడా అందిస్తోంది.
వివరాలకు: www.uasbangalore.edu.in
సామ్‌ హిగ్గిన్‌బాథమ్‌(అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ టెక్నాలజీ అండ్‌ సెన్సైస్‌ పిలుస్తారు డీమ్డ్‌ యూనివర్సిటీ), అలహాబాద్‌ వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ (అగ్రికల్చరల్‌), ఎంబీఏ (అగ్రిబిజినెస్‌) కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.
వివరాలకు: www.aaidu.org

Photo Stories