Skip to main content

ఎంఎస్సీ డెయిరీ సైన్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో వివరించండి?

హనుమంతరావు, పెనుగంచిప్రోలు.
Question
ఎంఎస్సీ డెయిరీ సైన్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో వివరించండి?
ఈ మధ్యకాలంలో డెయిరీ సైన్స్/టెక్నాలజీలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. అందువల్ల డెయిరీ రంగ విస్తృతి పెరిగి,అభివృద్ధి జరిగి ఉద్యోగావకాశాలు పెరిగాయి. డెయిరీ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా డెయిరీ టెక్నాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనిటిక్స్, డెయిరీ ఎకనామిక్స్ లాంటి అనేక అంశాలపై అధ్యయనం సాగిస్తారు. దీంతో ఈ కోర్సు పూర్తి చేశాక మిల్క్ ప్రాసెసింగ్, క్వాలిటీ కంట్రోల్ లాంటి రంగాల్లో పనిచేసేందుకు అవసరమైన స్కిల్స్‌ను పెంపొందించుకుంటారు. డెయిరీ ప్లాంట్స్, డెయిరీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. భారతదేశం లేదా విదేశాల్లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం ఉంది. పరిశోధనపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇందుకోసం ప్రయత్నించవచ్చు.

Photo Stories