Skip to main content

అగ్రికల్చర్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సు ఆఫర్‌ చేస్తున్న విశ్వవిద్యాలయాల గురించి వివరించండి?

Question
అగ్రికల్చర్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సు ఆఫర్‌ చేస్తున్న విశ్వవిద్యాలయాల గురించి వివరించండి?
వ్యవసాయ రంగానికి అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కొత్త పద్ధతులను కనిపెట్టడం, నూతన ఆవిష్కరణలు చేపట్టడం వంటి కార్యకలాపాలకు ఇంజనీరింగ్‌ అభ్యర్థులు అవసరమవుతారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచే క్రమంలో ఇంజనీర్లు వ్యవసాయదారులకు అందించే సూచ నలు, సలహాలు ఎంతో విలువైనవి. కాబట్టి వ్యవసాయ రంగానికి ఇంజనీర్ల అవసరం ఎంతో ఉంది.
కోర్సులు ఆఫర్‌ చేసే విద్యాసంస్థలు:
ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)-ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌
అర్హత: కనీసం 50శాతం మార్కులతో (ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులు 40 శాతం) బీటెక్‌ (అగ్రికల్చర్‌) పూర్తి చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.angrau.net
ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌తో అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)/ ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌ అండ్‌ డ్రై నేజ్‌ ఇంజనీరింగ్‌/ సాయిల్‌ వాటర్‌ కన్వర్జేషన్‌ ఇంజనీరింగ్‌ ప్రత్యేకాం శాలుగా అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టి ట్యూట్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ) కోర్సును ఆఫర్‌ చేస్తోంది.
అర్హత: బీఈ/బీటెక్‌ (మెకానికల్‌/అగ్రికల్చ రల్‌ ఇంజనీరింగ్‌) చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.aaidu.org

Photo Stories