Skip to main content

అగ్రికల్చర్ బీటెక్ చేసిన తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయో వివరించండి?

కృష్ణ, ప్రకాశం.
Question
అగ్రికల్చర్ బీటెక్ చేసిన తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయో వివరించండి?
ఇందులో ఉద్యోగావకాశాలు మెరుగుపరచుకోవడానికి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ.. 12
విభాగాల్లో ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
అర్హత: నాలుగేళ్ల వ్యవధి గల బీఎస్సీ (సీఏబీఎం)/బీఎస్సీ (అగ్రికల్చర్)
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.angrau.net

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్.. అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లలో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చరల్ సైన్స్/అనుబంధ సబ్జెక్టుల్లో డిగ్రీతోపాటు అగ్రిబిజినెస్ కంపెనీలు, ఎన్జీఓలు, కోఆపరేటివ్స్, ఇతర ప్రై వేటు రంగ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు.
ప్రవేశం: క్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.manage.gov.in

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని డాక్టర్ యశ్వంత్ సింగ్ పార్‌మార్ యూనివర్సిటీ ఆఫ్ హార్టీకల్చర్ అండ్ ఫారెస్ట్రీ.. ఎపీకల్చర్, ఫ్లోరీకల్చర్, ఎంటమాల జీ, ఫ్రూట్ బ్రీడింగ్, ల్యాండ్‌స్కేపింగ్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, వెజిటెబుల్ సైన్స్, మైకాలజీ, ప్లాంట్ పాథాలజీ, జెనెటిక్ రిసోర్సెస్ లాంటి స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సును అందిస్తోంది.
అర్హత: బీఎస్సీ హార్టీకల్చర్/అగ్రికల్చర్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.yspuniversity.ac.in

ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో:
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్).. వ్యవసాయంలో పరిశోధన విభాగంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులను రిక్రూట్ చేసుకునే సంస్థ.. ఏటా రిక్రూట్ చేస్తుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిస్ట్రిక్ట్ హార్టీకల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టుల నియామకాలను చేపడుతుంది. ఆర్గనైజర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్ లాంటి పోస్టులకు కృషి విజ్ఞాన్ కేంద్రాలు శిక్షణ ఇస్తున్నాయి. రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్ల పోస్టుల కోసం అనేక బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ పోస్టుల కోసం ప్రయత్నించవచ్చు.

ప్రైవేటు సంస్థల్లో: ప్రైవేటు సీడ్ కంపెనీల్లో ఆర్ అండ్ డీ విభాగాల్లో, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రయత్నించవచ్చు. హార్టీకల్చరిస్టు సర్వీసుల కోసం ఫార్మస్యూటికల్ కంపెనీలు హెర్బల్ మెడిసిన్స్ తయారీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఇందుకోసం ప్రయత్నించవచ్చు. టీచింగ్‌పై ఆసక్తి ఉంటే హార్టీకల్చర్, అగ్రికల్చర్ విద్యా సంస్థల్లో బోధించవచ్చు. లెక్చరర్, రీడర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

Photo Stories